వినాయక చవితికి నాలుగు రోజుల ముందే రిలీజవుతున్న ‘స్కంద’ సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్‌లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇక ఈ రెండు వారాల పాటు చిత్రయూనిట్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లు జరుపనుందట. పైగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తుండటంతో అన్నీ భాషల్లో ప్రెస్‌మీట్‌లను నిర్వహించాలని మేకర్స్ గట్టి ప్లాన్ లే చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతుందని తెలుస్తుంది. ఇండస్టీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ పోతినేని కెరీర్‌లో హైయెస్ట్ బిజినెస్ ఇదేనట. కాగా తాజాగా ఈ సినిమా నాన్`థియేట్రికల్ హక్కులుక ఊహించని రేంజ్‌లో డీల్ కుదిరిందట. ఈ సినిమా అన్ని భాషల హక్కులు కలుపుకుని డిజిటల్, సాటిలైట్ హక్కులను స్టార్ సంస్థ రూ.45 కోట్లకు డీల్‌ను ఫిక్స్ చేసుకుందట. కేవలం నాన్`థియేట్రికల్ హక్కులే ఈ రేంజ్‌లో అమ్ముడయ్యాయంటే మాములు విషయం కాదు. ఈ డీల్‌తో సగం కంటే ఎక్కువ బ్జడెట్ రకవరీ అయినట్లు తెలుస్తుంది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఇదే రోజు ఈ సినిమాకు పోటీగా రెండు అరవ సినిమాలు ‘చంద్రముఖి`2, మార్క్ ఆంటోనిలు రిలీజవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకైతే ఏమంత బజ్ లేదు. ఒక వేళ మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తే మట్టుకు కలెక్షన్‌లపై తీవ్ర దెబ్బ పడే అవకాశం ఉంది.
Related posts
-
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ దిల్ రాజ్
Spread the love రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు బుధవారం... -
అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల
Spread the love చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న... -
జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్
Spread the love మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది....