“మాఊరి పొలిమేర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. సాధారణంగా భారీ చిత్రాలకు మాత్రమే సీక్వెల్ చేస్తుంటారు. కానీ మీరు మా ఊరి పొలిమేర లాంటి చిన్న చిత్రానికి సీక్వెల్ చేయడానికి కారణం ? కథ రాసుకున్నప్పుడే తప్పనిసరిగా సీక్వెల్ చేద్డామని అనుకున్నం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2లో…
Author: M.D ABDUL - Tollywoodtimes
సినిమాల నుంచి రిటైర్మైంట్ ప్రకటించారు ‘ప్రేమమ్’ దర్శకుడు ఆల్ఫోన్స్ పుతిరన్!
ఆల్ఫోన్స్ పుతిరన్.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ‘ప్రేమమ్’ డైరెక్టర్ అంటే ఇట్టే గుర్తు పడతారు. నివిన్ పాలీ, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ప్రేమమ్’. ఆల్ఫోన్స్ పుతిరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2015లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన మలర్ పాత్ర ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఇంపాక్ట్ చేసింది. ఇక.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను చూడడం మొదలుపెట్టారంటే నమ్మక తప్పదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుతిరన్ సంచలన ప్రకటన చేశాడు. తాను డైరెక్షన్ నుంచి సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని అందుకే…
‘బేబి’ కాంబినేషన్ వన్స్‌మోర్..!
సంపూర్ణేశ్ బాబుతో ‘హృదయకాలేయం’ సినిమాతో రైటర్‌గా, నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ సాయిరాజేశ్ . ఈ ఏడాది ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కించిన ‘బేబి’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ చిత్రం నిర్మాత ఎస్‌కేఎన్ కు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతుంది. సాయిరాజేశ్, ఎస్‌కేఎన్ కాంబోలో ప్రొడక్షన్ నంబర్ 4గా వస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు మరోసారి రైటర్ కమ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు సాయిరాజేశ్. సంతోష్ శోభన్, అలేఖ్య హారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కినేని నాగచైతన్య ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. యూట్యూబర్‌గా సూపర్ ఫేమస్ అయిన అలేఖ్య హారిక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.…
తెలుగింటి కోడలు కాబోతున్న మరాఠీ సోయగం!
‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ సోయగం మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ అవకాశాలను దక్కించుకుంటున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్ తాజాగా సైమా వేడుకలో మృణాల్ ఠాకూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో లావణ్య త్రిపాఠిను హైదరాబాద్‌కు వచ్చేయమ్మా అని దీవిస్తే తాను తెలుగింటి కోడలు అయిందని, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ను కూడా అలాగే దీవిస్తున్నానని అరవింద్ తెలిపారు. దాంతో మృణాల్ ఎవరైనా తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నారా..? అని పలువరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం…
అనసూయ.. నెటిజన్లకు మరోసారి టార్గెట్ !
అనసూయ టీవీ యాంకర్‌గా ఎంత ఫేమస్ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్ అయింది. ప్రస్తుతం టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక ఆమె ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే! సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌ల వల్ల ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ట్రోలింగ్, మీమ్స్ అంటారా లెక్కలేనన్ని. అయితే వీటిపై పెద్ద దృష్టి పెట్టదు అనసూయ. సమయం వచ్చినప్పుడు మాత్రం దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయింది అనసూయ. ఓ టీవీ ఛానల్‌లో జరిగే అవార్డ్ ఫంక్షన్ లో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ కోసం అనసూయ మహానటి సావిత్రి గెటప్ వేశారు. అంతే కాదు.. జమున, శ్రీదేవి, సౌందర్య లాగా కూడా కనిపించింది. గతంలో…
రెండో పెళ్లి గురించి ఫైర్‌అయిన ప్రగతి..
క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్ సైట్‌లు రాసుకొచ్చాయి. కాగా తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఇలా ఫేక్ వార్తలను ఎందుకు పుట్టిస్తున్నారని ఫైర్ అయింది. అంతేకాకుండా తనపై వస్తున్న దృష్ప్రచారలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రగతి కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎలా రాస్తారని మండిపడింది. గౌరవమైన పొజిషన్‌లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరింది. అంతేకాకుండా వార్తలు ప్రచురించిన సంస్థపై ఫైర్…
రూమర్స్‌ను ఎదుర్కోవటం మామూలే… పట్టించుకోను : కృతిసనన్
‘‘జీవితంలో అద్భుమైన క్షణాలు ఒక్కసారే వస్తాయి. ఆ ఫీలింగ్ గొప్పది. ఇటీవల జాతీయ అవార్డును రాష్ట్రపతితో అందుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. మరాఠీ రీమేక్ అయిన ‘మిమి’లాంటి మహిళా ప్రాధాన్య పాత్ర ‘మిమి రాథోర్’ పాత్ర దొరకటం అదృష్టం. ఇందులో సరోగసి అమ్మగా నటించా. ఆ పాత్రకోసం ఎంతో కష్టపడ్డా’’ అన్నారు కృతిసనన్. టాలీవుడ్‌లో నటిగా పరిచయమై బాలీవుడ్‌లో ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సరోగసి అమ్మగా నటించడం కోసం ఎంతో కష్టపడ్డా. ఆ సమయంలో బాగా తినేదాన్ని. ఆకలిగా లేకున్నా బలవంతంగా తినేదాన్ని. యోగా, కసరత్తులు వదిలేశా. 15 కిలోలు బరువు పెరిగా. ఆ కష్టం ఊరికే పోలేదు. తగిన గుర్తింపు దక్కింది. మిర్చిమ్యూజిక్ అవార్డ్స్, ఐఫా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ అవార్డు దక్కడం అరుదైన గౌరవం.…
అంతా తమనే చేశాడు.. ‘గుంటూరు కారం’లో ఎన్నో విశేషాలు
మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్ అవుట్ అన్నారు. కానీ తమన్ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నాడు. మూడో వ్యక్తి కెమెరామెన్ పి.ఎస్ .వినోద్ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ’’ఇన్నేళ్ల జర్నీల్లో అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్. మహేశ్ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు’ అని సన్నిహితులు అడిగేవారు. అయితే ఈ చిత్రం నేను చేయడంతో వారందరికీ జవాబు దొరికినట్టే. కెమెరా గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తితో పనిచేయడం ఆనందంగా…
శంకర్ ‘ఇండియన్.2’ సినిమా అప్‌డేట్ వచ్చేసింది…!
27 ఏడేళ్ల తర్వాత సేనాపతిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు కమల్‌హాసన. ఆయన హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ‘ఇండియన్ (భారతీయుడు`ఎనిటతిజీని `2) అప్పట్లో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఆ చిత్రానికి కొనసాగింపుగా ఇండియన్`2 వస్తోంది. ‘భారతీయుడు’ చిత్రంలో సేనాపతిగా కమల్ ఎంతటి పవర్‌ఫుల్ రోల్ చేశారో.. ఇప్పుడు అంతకుమించి ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారు శంకర్. అయితే సినిమా ప్రకటించి ఐదేళ్లు దాటింది. పలు కారణాల చేత షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా శంకర్ పూర్తిగా ఈ చిత్రం విూదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని లోలా వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్‌కు సంబంధించి శంకర్ ఓ పోస్ట్ పెట్టారు. ఆదివారం ఈ…
శ్రీల లిప్‌లాక్ సినిమా ఏంటో తెలుసా?
శ్రీలీల ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగుతున్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుని తిరుగులేని అధిపత్యాన్ని చెలాయిస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాలను లైన్లో పెట్టింది. స్టార్ హీరోలు సైతం తన కాల్షీట్ల కోసం వేచి చూసేలా చేస్తు భారీ పారితోషకంతో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్నది. శ్రీలీల సినిమాలో ఉంది అంటే దానికి ప్రేక్షకులను క్యూ కట్టేలా చేస్తున్నది. ఈ అమ్మడు దెబ్బకు అప్పడివరకు ఫుల్ బీజీగా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నాలు వేరే ఇండస్ట్రీల వైపు మళ్లేలా చేసిందంటే శ్రీలీల రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.…
