Skip to content
Friday, November 6, 2026
  • facebook
  • instagram
  • linkedin
  • twitter
  • Home
  • FILM NEWS
  • Entertainment
  • INTERVIEWS
  • MOVIE REVIEWS
  • Politics
  • Gossips
  • Gallery
  • VIDEOS
  • YOUTUBE
  • E Paper

‘కుబేర’లాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి : కింగ్ నాగార్జున

Posted on Jun 19, 2025
You need guts to make a film like 'Kubera': King Nagarjuna
You need guts to make a film like 'Kubera': King Nagarjuna
Spread the love
     

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్.వి.సి.ఎల్.ఎల్ .పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయింది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున తో ఇంటర్వ్యూ …

‘కుబేర’ లాంటి మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ?
-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు(ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.

కుబేరలో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి ?
-కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్ లో ఎప్పటినుంచో ఉంది.
-ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్స్ లో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ నా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్ కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్.
– ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయి.
-ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు.

శేఖర్ గారు మీ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేశారా ?
-లేదండి. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.

మీ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్ కమ్ముల గారితో చేశారు కదా.. ఆయన స్టైల్ గురించి ముందుగా ఎవరినైనా అడిగారా?
-చైతన్యని అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారని’ చెప్పాడు

ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్ అన్నిటిలో కుబేరలో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందా ?
– ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్… అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉంటాయి.
– సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్ లో వర్క్ చేసాం.

రష్మిక మందన క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-తన క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.

కుబేర నిర్మాతల గురించి?
సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్ తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి?
-ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు చాలా సిచువేషనల్ గా వస్తాయి. దేవి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
-ఈ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్ ప్లేకాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలు గానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.

100 సినిమా ప్లానింగ్స్ జరుగుతున్నాయని విన్నాం?
అవునండి. ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ కింగ్ 100 అని పెట్టారు.

చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆహార నియమాల్లో ఏమైనా మార్పులు చేశారా?
లేదండి. గత 15 ఏళ్లుగా ఏం చేస్తున్నానో అదే చేస్తున్నాను. కొత్తగా చేసింది ఏమీ లేదు.

పాన్ ఇండియా ట్రెండ్ మీద మీ ఒపీనియన్ ?
-పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలో కావడం లేదు కదా.

శివ 4k పనులు ఎంతవరకు వచ్చాయి ?
శివ 4కె ఫినిష్ అయింది. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతుంది. చాలా బాగా వస్తుంది. ఒక రీల్ చూసాను. చాలా అద్భుతంగా ఉంది.

సితార బ్యానర్ లో మీరు ఒక సినిమా చేస్తారాని విన్నాం?
సితార , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ చేయాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ సెట్ కావాలి.

కూలీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
-కూలీలో డిఫరెంట్ కరెక్ట్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్యూ

Post navigation

Previous: సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ప్రైమ్ వీడియో ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ విడుదల
Next: ‘కన్నప్ప’లోని ప్రతీ పాత్ర హీరోనే : డా.ఎం. మోహన్ బాబు

Related Posts

Jayadeva's work for two years as 'Best Cinema Book'
  • FILM NEWS

Jayadeva’s writings for two years as ‘best film book’

  • M.D ABDUL
  • May 29, 2025
  • 0
Spread the love
     

Spread the love      Telangana Government’s ‘Gaddar Film Award – 2024’ […]

'ఇంటింటి రామాయణం' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర బృందం
  • Entertainment
  • FILM NEWS

‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర బృందం

  • M.D ABDUL - Tollywoodtimes
  • Jun 10, 2023
  • 0
Spread the love
     

Spread the love     సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన […]

Thank you so much to the Telugu audience all over the world who are celebrating 'Mana Shankara Vara Prasad Garu'. The entire credit for this success goes to Chiranjeevi Garu: Director Anil Ravipudi on mega blockbuster Thank You Meet
  • FILM NEWS

‘మన శంకర వర ప్రసాద్ గారు’ను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారిదే: మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి

  • M.D ABDUL
  • Jan 13, 2026
  • 0
Spread the love
     

Spread the love     మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా బ్లాక్ […]

Live Update

View All
“After watching KilleR, audiences will be thrilled to see how a film can be written and made with such a diverse approach” – Director, Producer and Actor Poorvaaj
  • Entertainment

“After watching KilleR, audiences will be thrilled to see how a film can be written and made with such a diverse approach” – Director, Producer and Actor Poorvaaj

  • M.D ABDUL
  • Oct 27, 2026
  • 0

The sensational sci-fi thriller Killer stars Jyoti Poorvaj and Poorvaaj in lead roles. Manish Gilada,…

  • Entertainment

కమెడియన్ రామచంద్రకు అండగా నటుడు అయినాబత్తిన దశరధ

  • M.D ABDUL
  • Oct 27, 2026
  • 0

మానవత్వాన్ని చాటుకున్న దశరధ.. ‘కిల్లర్’ సినిమా విజయానికి రామచంద్ర శుభాకాంక్షలు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న…

Actor INABATHINA Dasaradha Extends Financial Support to Comedian Ramachandra
  • Entertainment

Actor INABATHINA Dasaradha Extends Financial Support to Comedian Ramachandra

  • M.D ABDUL
  • Oct 27, 2026
  • 0

Ramachandra Appreciates INABATHINA Dasaradha’s Humanitarian Efforts and Wishes Him Success for His Silver Screen Journey…

Dynamic Hero Sriram's "Ramabhadrudu" Movie Team Invite Aspiring Actors
  • FILM NEWS

ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా టీమ్

  • M.D ABDUL
  • Oct 25, 2026
  • 0

కాస్టింగ్ కాల్ ప్రకటించిన "రామభద్రుడు" సినిమా టీమ్ "యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్…

Dynamic Hero Sriram's "Ramabhadrudu" Movie Team Invite Aspiring Actors
  • Entertainment

Dynamic Hero Sriram’s “Ramabhadrudu” Movie Team Invite Aspiring Actors

  • M.D ABDUL
  • Oct 25, 2026
  • 0

"Ramabhadrudu" Movie Team Announces Casting Call "Ramabhadrudu" is the new film starring dynamic hero Sriram,…

Birthday celebrations for IAS officer Jayesh Ranjan held on a grand scale in Alair
  • Lifestyle

ఆలేరులో ఘనంగా జయేష్ రంజన్ ఐఏఎస్ జన్మదిన వేడుకలు

  • M.D ABDUL
  • Oct 25, 2026
  • 0

* దీనశరణ్య ఎన్జీవో ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ ఆలేరు, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ…

Copyright © 2024 Tollywoodtimes.in Powered by LikhiMedia Theme: National News By Adore Themes.