ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఒకరికొకరు సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటుంటాను. బయటకు వెళ్ళినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. అలాగే ఉన్న దాంతో సంతృప్తి చెంది, ఆనందంగా ఉంటాను. పిండం సినిమా గురించి చెప్పండి?…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘Pindam’ is the film that we all did with so much passion: Hero Sriram
The upcoming Telugu horror thriller ‘Pindam’ is slated to release in theatres worldwide on December 15. Directed by Saikiran Daida, the film features Srikanth Sriram, Kushee Ravi, Srinivas Avasarala, Easwari Rao, Ravi Varma. Other cast members include: Manik Reddy, Baby Chaitra, Baby Leisha, Vijayalakshmi and Srilatha in crucial roles. The movie is produced by Yeshwanth Daggumati and co-produced by Prabu Raja. The story is written by Saikiran Daida, Kavi Siddhartha and Toby Osborne. Actor Sriram, who is playing the protagonist in the film, interacted with the print/web journalists on Tuesday.…
నానికి బన్నీ ప్రశంశలు!
నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలవర్షం కురిపించారు. మధురమైన చిత్రమని, మనసుకు హత్తుకుందని ఆయన కొనియాడారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆయన వీక్షించారు. ఈ మేరకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సోదరుడు నాని నటన అద్భుతం. ఆకర్షణీయమైన స్క్రిప్ట్ను వెలుగులోకి తెచ్చినందుకు టీమ్ విూద మరింత రెస్పెక్ట్ పెరిగింది. మృణాల్ నటన మనసుకు హత్తుకుంది. ఆ పాత్ర ఆమెకు లాగే బ్యూటిఫుల్‌గా ఉంది. మై డార్లింగ్ బేబీ కియారా.. నీ క్యూట్‌నెస్‌తో మనసుల్ని కరిగించేశావు. ఇక చాలు స్కూల్‌కి వెళ్లిపో. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కడా పేరు పెట్టడానికి లేకుండా తమ ప్రతిభను చూపించారు. సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని తెరపై కనిపిస్తోంది. ముఖ్యంగా కెమెరామెన్ సాను జాన…
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన వచ్చింది : సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 10 : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటికి వెంటనే శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఆర్.ఐ గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి గతంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే, ఐఎన్ టీయూసీలో చురుకైన పాత్రని పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా ఆయన శుభాకాంక్షలు అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం; ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న బీమా పరిమితిని…
Allu Aravind Presents- Naga Chaitanya Akkineni, Sai Pallavi, Chandoo Mondeti, Bunny Vasu, Geetha Arts- Thandel Muhurtham Ceremony held Grandly
Yuva Samrat Naga Chaitanya and director Chandoo Mondeti joined forces for the third time for a crazy project Thandel to be produced by Bunny Vasu and presented by Allu Aravind on the Geetha Arts banner. This high-budget film, which is the most expensive one for Naga Chaitanya, had its grand launching ceremony today. King Nagarjuna and Victory Venkatesh attended the Pooja ceremony which was also graced by numerous film celebrities. Nagarjuna switched on the camera for the muhurtham shot, while Venkatesh sounded the clapboard. Allu Aravind handed over the script…
అల్లు అరవింద్ ప్రెజెంట్స్ – నాగ చైతన్య అక్కినేని, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్- ఘనంగా జరిగిన ‘తండేల్’ ముహూర్తం వేడుక
యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కు హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన ‘తండేల్’ ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు నమస్కారం. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా వుంది. మా…
‘కలశ’ ట్రైలర్ ను ఆవిష్కరించిన స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ .. డిసెంబర్ 15న గ్రౌండ్ రిలీజ్
చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కలశ. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు.ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకులు మలినేని గోపిచంద్ మాట్లాడుతూ : కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబు కి నిర్మాత కు నటీనటులకు టెక్నీషియన్స్…
Hi Nanna Review in Telugu: ఫీల్ గుడ్ సినిమా!
న్యాచురల్ స్టార్ అన్న పేరుకు తగ్గట్టే నాని నటన చాలా సహజంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. రొమాంటిక్ సినిమాల్లో నటన తోటి యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ‘దసరా’ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని లుక్‌కు, నటనకు మంచి పేరొచ్చింది. నాని తాజాగా ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటంలో ముందుండే కథానాయకుడు నాని. మరోసారి ఈ సినిమాతో శౌర్యవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పాత లుక్‌లో కనిపించారు. మరి, కెరీర్‌లో ఎక్కువ విజయాలు తెచ్చిన పెట్టిన జోనర్‌లో నాని సక్సెస్…
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ రివ్యూ : ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాయే..!
టాలీవుడ్ లోమనకు రేసుగుర్రం, కిక్, కిక్ 2, టెంపర్ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి దర్శకుడు వక్కంతం వంశీ అనగానే . అయితే రైటర్‌గా ఎన్నో సక్సెస్‌లు చూసిన వక్కంతం వంశీ దర్శకుడిగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తీసుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడు. ‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలన్న కసి ఆయనలో మెండుగా ఉంది. చాలా గ్యాప్ తీసుకుని నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను తీశాడు. ఈ సినిమాతో నితిన్, వక్కంతం వంశీ ఇద్దరూ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన వక్కంతం వంశీ మరి ఈ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా? లేదా ఓ సారి చూద్దాం. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా…
కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామి రంగ’ నుంచి ‘వరలక్ష్మి’గా ఆషికా రంగనాథ్ పరిచయం
తన దశాబ్దాల కెరీర్‌లో ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను పరిచయం చేసిన కింగ్ నాగార్జున అక్కినేని తన తాజా చిత్రం ‘నా సామి రంగ’తో మరో నూతన దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా, ఈరోజు మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్ ద్వారా ‘వరలక్ష్మి’గా పరిచయమైన ఆషికా రంగనాథ్ సాంప్రదాయ దుస్తులలో ఆభరణాలతో ఆకర్షణీయంగాఉంది. ఆషికా అద్దం ముందు నిల్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లు మేకర్స్ ఒక గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇందులో దూరం నుండి ఒకరినొకరు మెచ్చుకుంటూ కనిపించడం చాలా డిలైట్ ఫుల్ గా వుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి తన స్పెల్‌బైండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు. నాగార్జున…
