గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. “మ్యూట్ విట్నెస్” అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ “తన శిష్యుడు విశ్వకు మంచి పేరు, తన మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా “గీత” నిలవాలని” ఆకాంక్షించారు. వి.వి.వినాయక్ తమ చిత్రం “గీత” ఘన విజయం సాధించాలని అభినందించడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వక్తం చేశారు. ఈనెల 14న “గీత” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘సిరివెన్నెల’కు నివాళిగా ‘నువ్వే నువ్వే’ను అంకితం ఇస్తున్నాం : త్రివిక్రమ్, ‘స్రవంతి’ రవికిశోర్
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనకు చిత్ర బృందం హాజరయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ”వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో… దాదాపుగా అంత అమౌంట్…
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన “దీంతననా”పాట విడుదల
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా నేడు “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “దీంతననా” అనే మొదటి పాటను రిలీజ్ చేసారు చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ…
14న వస్తున్న ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’
విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ..”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ న్యూ ఏజ్ కాన్సెప్ట్. చాలా ఫన్ కాన్సెప్ట్. ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు అంకిత భావంతో పని చేశాం. దర్శకుడు సంతోష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ పై హైప్ రావడానికి కారణం దర్శకుడు సంతోష్. డీవోపీ బాల వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. నిర్మాతలు వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్…
‘కౌశిక వర్మ దమయంతి’లోని ‘పదరా పదరా వేటకు వెళ్దాం.. ‘ పాట విడుదల
దమయంతి అనే రైటర్ కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ. “కౌశిక వర్మ దమయంతి”. వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్ పతాకంపై విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్ నటీ నటులుగా సుధీర్, విశ్వజిత్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలో హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతులమీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా.. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “కౌశిక వర్మ దమయంతి సినిమాకు యస్. యస్ ఆత్రేయ…
శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘ప్రిన్స్’ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్టోబర్ 25 దీపావళితో లాంగ్ వీకెండ్‌ను ప్రిన్స్ క్యాష్ చేసుకోనుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయి ప్రేమ కథ, వారి ప్రేమ కథలోని సమస్యల హిలేరియస్ గా ట్రైలర్ ప్రజంట్ చేసింది. శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క ఇద్దరూ ఒక పాఠశాలలో పని చేస్తుంటారు. శివకార్తికేయన్ తండ్రిగా సత్యరాజ్ ఒక సంఘ సంస్కర్త, తను ప్రేమకి ఆమోదాన్ని తెలిపినప్పటికీ, ప్రేమకథకు మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి. అనుదీప్ కెవి విభిన్నమైన రోమ్-కామ్‌ని ఎంచుకుని, దానిని తన శైలిలో ప్రజంట్ చేశాడు. ట్రైలర్‌లో…
‘స్వాతిముత్యం’తో గణేష్ ని హీరోగా ఆదరించడం ఆనందంగా వుంది : బెల్లం కొండ సురేష్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాత. బెల్లం కొండ గణేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. నూతన దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ నిర్మాత, హీరో గణేష్ తండ్రి బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా .. నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. స్వాతిముత్యం చిత్రానికి అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో స్వాతిముత్యం లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబు గారికి నా జీవితాంతం రుణపడి వుంటాను. మా అబ్బాయి గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా వుంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సప్ట్ చేశారు. ఈ చిత్రంలో రావు రమేష్ , గోపరాజు, ఇలా అందరూ అద్భుతంగా చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని స్వాతిముత్యం మరోసారి రుజువుచేసింది. పెద్ద సినిమాల మధ్య వచ్చిన స్వాతిముత్యం మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రేక్షకులు సినిమాని చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం నా జన్మలో మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” తెలిపారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘స్వాతిముత్యం’తో రుజువు చేశారు. పెద్ద సినిమాల మధ్య స్వాతిముత్యం చిన్న సినిమాగా వచ్చినప్పటికీ శుక్రవారం నుండి కలెక్షన్స్ మెరుగౌతున్నాయి. తొలి సినిమాకి ఇంత మంచి ఆదరణ నేను ఊహించలేదు. నటుడిగా మంచి పేరు వచ్చింది. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వగలనని ప్రేక్షకులు ప్రసంశించడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ, చినబాబు గారికి కృతజ్ఞతలు” తెలిపారు. దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ మాట్లాడుతూ.. స్వాతిముత్యంను ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. బెల్లం కొండ సురేష్ గారు నాపై ఎంతో నమ్మకం వుంచి, నన్ను మొదటి నుండి ఎంతో ప్రోత్సహించారు. మా నిర్మాతలు వంశీ అన్న, చినబాబు గారికి కృతజ్ఞతలు. రిపీట్ ఆడియన్స్ వుండే సినిమా స్వాతిముత్యం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన ఫోన్ పే కో ఫౌండర్లు ముంబై ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 2022లో నిర్వహించిన రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా తమ కుటుంబాన్ని విస్తరించుకోవడానికి సిద్ధమైంది. భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్ధాపకులు ఇప్పుడు ఈ లీగ్‌లో మదుపరులుగా వచ్చి చేరారు. ఈ పీవీఎల్‌లో వారు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా 8వ ఫ్రాంచైజీ– ముంబై మీటార్స్‌ను సొంతం చేసుకున్నారు. పూర్వ భారత వాలీబాల్ టీమ్ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారు. ఈ సందర్భంగా సమీర్ నిగమ్ మాట్లాడుతూ ‘‘ నా వరకూ తరచుగా వాలీబాల్ ఆడే…
ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో ‘మిస్టర్ అండ్ మిసెస్’….ఒకరికి ఒకరు
తెలుగు టీవీరంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. దర్శకుడు అనిల్ కడియాలను, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో సపోర్టు చేయటంతో అనేక బ్లాక్‌బస్టర్ టీవీషోలను అనిల్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఉదాహరణకు అనిల్ కడియాల దర్శకత్వంలో ఈ టీవీలో గత ఆరేళ్లుగా ‘అలీతో సరదాగా’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ‘వావ్’, ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్ షోలను డిజైన్ చేసి దర్శకత్వం వహించారు అనిల్ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య,భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే స్పీడుతో ‘మిస్టర్ అండ్ మిసెస్’ ఒకరికి…
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 15న రిషబ్ శెట్టి “కాంతారా” విడుదల
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యశ్ తో ‘మాస్టర్ పీస్’ తీశారు. మూడో సినిమాగా పునీత్ తో తీసిన ‘రాజకుమార’ ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఆపై చరిత్ర మొదలైంది. యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్’ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘కెజిఎఫ్2’ కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన ‘యువరత్న’ ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే. ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్…
