‘విధిలిఖితం’ మోష‌న్ పోస్టర్ విడుదల

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సోషియో ఫాంట‌సీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా నిర్మాత పాండు నిర్మాణంలో ఎమ్ లోచ‌న్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘విధిలిఖితం’. ఈ చిత్రంలో శ‌శాంక్ మంగు, భ‌వ్య‌శ్రీ హీరోహీరోయిన్స్‌గా చేస్తుండ‌గా అతి ముఖ్య‌మైన పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు సూర్య‌కుమార్ భ‌గ‌వాన్ దాస్ న‌టిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థ, కాన్సెప్ట్‌తో ఆధ్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం యొక్క మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ చూసిన వారంతా కొత్తగా ఫీల్ అవ‌టం చిత్ర యూనిట్‌కి చాలా ఆనందం క‌లిగించింది. ఈ సంద‌ర్బంగా నిర్మా‌త పాండు మాట్లాడుతూ.. ‘‘రెగ్యుల‌ర్ చిత్రాలు తీస్తే చూసే ప‌రిస్థితి ఇప్ప‌డు లేదు. ఒక కొత్త పాయింట్‌తో సినిమా తీయ‌క‌పోతే ఈ కాంపిటేష‌న్‌లో వుండ‌టం క‌ష్టంగా వుంది. డైరెక్ట‌ర్ ఎమ్ లోచ‌న్ చెప్పిన క‌థ చాలా…

‘రైడ‌ర్‌’ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడ‌ర్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 11న శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నిఖిల్ కుమార్ ప‌రుగెత్తుతూ క‌నిపిస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లో ఉన్నార‌నీ, గూండాల‌ను చిత‌గ్గొడుతున్నార‌నీ వాళ్లు చెల్లాచెదురుగా కింద‌ప‌డిపోవ‌డం తెలియ‌జేస్తుంది. ‘రైడ‌ర్’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్న‌ట్లుగా ఆ ఫ‌స్ట్ లుక్‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్‌తో పాటు విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ మ‌రింత…

అఖిల్ అక్కినేని 5వ సినిమా వివరాలివే

Akhil Akkineni 5th Film

ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘ఇట్స్ టైమ్‌! సురేంద‌ర్ రెడ్డి, అనీల్‌సుంక‌రగారితో నా సినిమా అనౌన్స్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఇది నాకు ఎక్స్‌ట్రీమ్‌లి స్పెష‌ల్ మూవీ. పూర్తి ఉత్సాహంతో…

కింగ్ నాగార్జున వదిలిన ‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైల‌ర్

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ జంట‌గా న‌టించిన చిత్రం ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’. చ‌ల‌న చిత్రాలు బ్యాన‌ర్‌పై వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 18న ఈ సినిమాను తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో విడుద‌ల చేస్తున్నారు. గురువారం(సెప్టెంబ‌ర్ 3) రోజున ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘అమ‌రం అఖిలం ప్రేమ‌ ట్రైల‌ర్ చూశాను. చాలా బావుంది. మ‌రో చ‌రిత్ర‌, ఏక్ తూజే కేలియె స్టైల్లో అనిపించింది. నాకు ‘బొమ్మ‌రిల్లు’ సినిమా గుర్తుకొచ్చింది. తండ్రీ, కూతురు మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 18న ఆహాలో విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.…

‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్’లోని పోతురాజు లుక్

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’‌. ఈ రోజు(గురువారం) నందు పుట్టినరోజు సందర్భంగా నందుని ‘పోతురాజు’గా పరిచయం చేస్తూ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఈ చిత్ర‌ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్‌కి అభిమానిగా న‌టిస్తున్నారు. ఈ క్యారెక్ట‌ర్ చాలా వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా క‌నిపించ‌బోతున్న నందు క్యారెక్ట‌ర్ కి ధీటుగానే హీరోయిన్ ర‌ష్మీ గౌత‌మ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించబోతున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో అన్ని…

పవన్ బర్త్‌డే స్పెషల్: ‘ఉప్పెన’ న్యూ పోస్ట‌ర్‌

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. విజ‌య్ సేతుప‌తి ఒక కీల‌క పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. బుధ‌వారం (సెప్టెంబ‌ర్ 2) ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ‘ఉప్పెన’ చిత్ర బృందం హీరో వైష్ణ‌వ్ తేజ్ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో వైష్ణ‌వ్ తేజ్ చాలా హ్యాపీ మూడ్‌లో క‌నిపిస్తున్నారు. క‌ల‌ర్‌ఫుల్ ష‌ర్ట్ ధ‌రించి కాల‌ర్‌ను నోటితో ప‌ట్టుకొని, న‌డుంపై చేయిపెట్టి సూప‌ర్ హ్యాండ్స‌మ్‌గా ఉన్నారు వైష్ణ‌వ్ తేజ్‌. హీరోయిన్‌ను చూస్తున్న ఆనందం ఆయ‌న ముఖంలో క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ బాణీలు…

‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్‌కళ్యాణ్ పుట్టిన‌రోజు(సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఒక వైపు మ‌హాత్మాగాంధీ ఫొటో, మ‌రో వైపు అంబేద్క‌ర్ ఫొటో మ‌ధ్య ప‌వ‌న్ లాయ‌ర్ కోటు వేసుకుని నిల‌బడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా అనే పుస్త‌కం ప‌ట్టుకుని ప‌వ‌న్ ఠీవిగా నిల‌బ‌డి ఉన్నలుక్‌తో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల అంచ‌నాల‌ను మించేలా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే…