అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై గతంలో హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కమర్షియల్ హిట్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాత సాయి రాజేశ్‌తో స్పెషల్ చిట్ చాట్ కలర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది? కలర్ ఫొటో కథ నా సొంత అనుభవాలు నుంచి నేను తయారు చేసుకున్న కథ. ఈ సినిమా దర్శకుడు సందీప్ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మనోడుకి డైరెక్షన్ ఛాన్స్ ఇప్పిద్దామని చాలా ట్రై చేశాను, అయితే కొన్ని అనివార్య కారాణాలు వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దీంతో సందీప్ కి నేను రాసుకున్న కథ ఇచ్చి, నేనే నిర్మాతగా మారి కలర్ ఫొటో చిత్రాన్ని తీశాను, అలానే ఈ చిత్ర నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది. రంగు వివక్ష గురించి ఈ…
Author: M.D ABDUL
శోభానాయుడు లోటు తీర్చలేనిది: చిరు
ఈ రోజు ఉదయాన్నే శోభానాయుడు మరణవార్త వినగానే నేను నిర్ఘాంతపోయాను. శోభానాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప కళాకారిణి ఆమె. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే. శ్రీ వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. వారితో నాకు వ్యక్తి గతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రసంశించుకునే కళాకారులం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సమయంలో ఆమె చేసిన ఓ నృత్య గేయం కూడా చూశాను. అది చూసినప్పుడు నాకూ ఎంత ముచ్చట కలిగిందంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించి సమాజం కోసం కరోనా గురించి స్పందించి ప్రజల్ని చైతన్యం చేయడం…
‘మాయ’ ఫస్ట్‌లుక్ రెస్పాన్స్ అదిరింది
ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాయ’. సంధ్య బయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, రోహిణి కుమార్, అభిషేక్, ఐడా, మధు, మహిమా ఇతర పాత్రధారులుగా నటించారు. రేసన్ ప్రొడక్షన్స్, విఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై గోపికృష్ణ జయంతి నిర్మించారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డస్టిన్ లీ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ‘మాయ’ ఫస్ట్‌లుక్‌ని ఇటీవల ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదలచేశారు. ఈ ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత గోపికృష్ణ జయంతి మాట్లాడుతూ.. ‘‘ప్రీ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీ పట్ల…
‘ట్రు’ మూవీ టైటిల్ లోగో విడుదల
గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘ట్రు` అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్, డి ఎస్ రావ్, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దంగా…
రవితేజ మాంచి ‘క్రాక్’ మీదున్నాడు
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇదివరకు ఆ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయ్యాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై కన్నేశారు. ‘క్రాక్’ షూటింగ్ గత వారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభమైంది. రవితేజ, ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. సోమవారం ‘క్రాక్’ షూటింగ్‌కు సంబంధించిన ఒక వర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాపర్‌గా శానిటైజ్ చేయడం, ఎంట్రన్స్‌లో డిజిన్‌ఫెక్టెంట్ టన్నెల్‌ను ఏర్పాటు చేయడం మనం చూడొచ్చు. రవితేజ, గోపీచంద్ మలినేని సహా సెట్‌లో ఉన్న ప్రతి యూనిట్ మెంబర్ మాస్క్ ధరించి కనిపిస్తున్నారు. కెమెరా ముందుకు వచ్చి నటిస్తున్నప్పుడు మాత్రమే…
సంక్రాంతి కానుకగా ‘ఊహించలేదు కదు’
కోలీవుడ్ హీరో శ్రీరామ్ నటించిన సినిమా ‘ఓమ్ శాంతి ఓమ్’. బైలింగ్వల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఊహించలేదు కదు’ పేరుతో అదే రోజు విడుదల చేయబోతున్నారు. శ్రీరామ్ కు జోడీగా నీలమ్ ఉపాధ్యాయ నటించారు. ఈ సినిమాను రెహమాన్ క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదం, హీరో ఒక్కడే బతికి ఉండడం , ఆపై జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పునః ప్రారంభమైన నాగ శౌర్య చిత్రం
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల. చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి. నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్నిర్మాత: సూర్య దేవర నాగవంశీదర్శకత్వం: లక్ష్మీసౌజన్య
సుశాంత్ న్యూ మూవీ షూటింగ్ పునఃప్రారంభం
యంగ్ హీరో సుశాంత్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో చేసిన పాత్రతో ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దాని తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లు సుశాంత్, మీనాక్షి చౌధరి లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ పాటను శ్రీనివాసమౌళి రచించారు. కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. సెప్టెంబర్ 20 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్…
‘బంజారావుడ్’ ప్రారంభం
భారతదేశం సంప్రదాయాలకు, వేశధారణకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో 15 కోట్ల 50 లక్షల మంది బంజారాలు ఉన్నారు. ఈ బంజారా ప్రజలు ప్రతి రంగంలో ముందున్నారు. అలాంటి వారు సినిమా రంగంలో కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో గోర్ జీవన్ సినిమాలు తనకంటూ ఒక స్థానం సంపాదించాలనుకున్న కెపిఎన్. చౌహన్ తన బంజారా ప్రజలకు ఒక సినిమా పరిశ్రమ కావాలంటూ కష్టపడి బంజారా ఫిలిం ఇండస్ట్రీని స్థాపించారు. ఇది ప్రతి బంజారా బిడ్డ చెప్పుకోదగ్గ విషయం. 8 నుండి 10 కోట్ల జనాభా ఉన్న ఏపి – తెలంగాణ స్టేట్స్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే నాలుగు కోట్ల చిల్లర ఉన్న కెనడా ప్రజలకు కెనడా ఇండస్ట్రీ ఉంది. రెండు కోట్ల జనాభా ఉన్న భోజ్ పూరి ప్రజలకు సినిమా ఇండస్ట్రీ ఉంది. అలాంటిది దేశం మీద…
జనసేనానితో కిచ్చా భేటీ
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ని ప్రముఖ నటుడు, కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.
