బాలకృష్ణ ‘నర్తనశాల’కు మోక్షం

balakrishna narthanasala release date out

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24…

బ్యాచ్‌లర్‌ ప్రీ టీజర్‌.. అయ్యాయ్య‌య్యో!

most eligible bachelor pre teaser released

అఖిల్ అక్కినేని హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, స‌క్స‌స్‌ని కెరాఫ్ అడ్రాస్‌గా మార్చుకున్న యంగ్ నిర్మాత‌ బ‌న్ని వాసు, మ‌రో నిర్మాత వాసువ‌ర్మలు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘Most Eligible బ్యాచ్‌ల‌ర్’.. ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్ర‌తి ప్రమోషన్ మెటిరియ‌ల్ కి హ్యూ‌జ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం. ముఖ్యంగా అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ అన‌గానే ఒక క్రేజ్ వ‌చ్చింది. అంతేకాకుండా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రం వ‌స్తుండ‌టం వ‌ల్ల‌ మోస్ట్ క్రేజి‌య‌స్ట్ ఫిల్మ్ అయ్యింది. అయితే మొట్ట మొద‌టి సారిగా ప్రీ-టీజ‌ర్ ని విడుద‌ల చేశారు యూనిట్‌.. ఈ ప్రీ-టీజ‌ర్ అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ టీజ‌ర్ లో…

క‌ల‌ర్ ఫుల్‌గా ‘క‌ల‌ర్ ఫొటో’ ఫంక్షన్

color photo movie pre release event highlights

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం క‌ల‌ర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ ద్వారా హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట వంటి సూప‌ర్ హిట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్‌ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు క‌ల‌ర్ ఫొటో చిత్రానికి క‌థ కూడా అందించ‌డం విశేషం. ప్ర‌ముఖ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా యాప్ ద్వారా ఈ సినిమా అక్టోబ‌ర్ 23న విడుద‌ల అవుతుంది. ఈ…

‘భూమిక’ ఫస్ట్ లుక్‌ వదిలిన మిల్కీ బ్యూటీ

aishwarya rajesh boomika first look released

తమిళంతో పాటు తెలుగులో కూడా త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్ మ‌రో థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. ‘భూమిక’ అనే టైటిల్ తో తెరకెక్క‌నున్న ఈ థ్రిల్ల‌ర్ ఐశ్వ‌ర్య రాజేశ్ కి 25వ సినిమా కావ‌డం విశేషం. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్ ద్వారా కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించిన పెంగ్విన్ చిత్రం విడుద‌లైంది. కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్ ఈ సినిమాకు…

‘మ‌హాస‌ముద్రం’లో మరో హీరోయిన్‌ ఫిక్స్

anu emmanuel in ajay maha samudram movie

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ క‌ల‌యిక‌లో ‘మ‌హాస‌ముద్రం’ చిత్రం రూపొంద‌నున్న‌ది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ స‌న్నాహాలు చేస్తోంది. సెట్స్ మీద‌కు వెళ్ల‌క ముందే ఒక దాని త‌ర్వాత ఒక‌టిగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అనౌన్స్‌మెంట్లు ఇస్తూ ‘మ‌హాస‌ముద్రం’ ప్రాజెక్టుపై అంచ‌నాలు పెంచేస్తూ వ‌స్తున్నారు నిర్మాత‌లు. ఇద్ద‌రు హీరోయిన్లు ఉండే త‌న చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల కోసం స‌రైన న‌టుల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. క‌థ‌కు కీల‌క‌మైన ఒక హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం ఇప్ప‌టికే టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావ్ హైద‌రిని ఎంపిక చేశారు. కాగా లేటెస్ట్‌గా అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు.…

‘నిన్నిలా నిన్నిలా’ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్

ninnila ninnila title and first look

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. న‌టీన‌టులు:అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శినిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణిసంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌పాట‌లు: శ్రీమ‌ణిఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌ఎడిటింగ్‌: న‌వీన్ నూలిడైలాగ్స్‌: నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి

‘బొమ్మ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్’ సింగిల్‌ వదిలిన మెగా ప్రిన్స్

hero varun tej unveils bomma blockbuster single

విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రం బొమ్మ ‌బ్లాక్ బ‌స్ట‌ర్. నూత‌న ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజ‌య్ కృష్ణ‌, డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంట‌గా న‌టిస్తున్నారు. ముందుగా టైటిల్ ఆ త‌రువాత విడుద‌ల చేసిన టీజ‌ర్‌తో అటు ఆడియెన్స్‌లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర యూనిట్. ఈ నేప‌థ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి రాయే నువ్వు రాయే అనే పాట‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గారు ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్‌గా…

ప్రారంభమైన సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’

satyadev new movie thimmarusu launched

‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘తిమ్మరుసు’ చిత్రానికి ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా.. సత్యదేవ్‌ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా…

‘ఇద్దరి లోకం ఒకటే’ ప్రచార చిత్రం విడుదల

prasanna kumar launched the poster of iddari lokam okate

యువ ప్రతిభాశాలి ‘అయ్యప్ప’ను కథానాయకుడిగా మరియు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అంకం సమర్పణలో వై.ఉమాదేవి నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. అయ్యప్ప, అమృత పావని, దివ్య, శ్రీనివాస్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేయగా.. పోస్టర్‌ను యువ దర్శకులు జితేందర్-దర్శక నిర్మాత శివనాగు సంయుక్తంగా ఆవిష్కరించి ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్ర బృందానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. పెద్ద మనసుతో తమ చిన్న చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న అతిథులకు చిత్ర దర్శకుడు-కథానాయకుడు అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అమృత పావని, దివ్య, శ్రీనివాస్, వంశీ పవన్, ఈశ్వరరావు వానపల్లి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్,…

హరీష్‌ వదిలిన క్షీర సాగర మథనం గీతం

director harish shankar launched KSM 2nd Single

అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ‘క్షీరసాగరమథనం’లోని ‘నీ పేరు పిలవడం… నీ పేరు పలకడం’ గీతాన్ని సంచలన దర్శకులు హరీష్ శంకర్ ట్విట్టర్‌లో విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అజయ్ అరసాడ స్వర కల్పనలో.. శ్రీమణి రాసిన ఈ పాటను ‘రాములో రాముల’ ఫేమ్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం పోస్ట్…