ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్

Athreyapuram Brothers Movie Launched Grandly, Intriguing Concept Poster Unveiled
Spread the love

కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వశిష్ట, డైరెక్టర్ అనుదీప్, డైరెక్టర్ ఆదిత్య హాసన్, డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వశిష్ట క్లాప్ కొట్టగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్ అందించారు. మరో డైరెక్టర్ అనుదీప్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఏ స్వీట్ రైవల్రీ అనే ట్యాగ్ లైన్ తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇది చూస్తూనే ఈ సినిమా కథలో వైవిద్యం ఉంటుందని, గత సినిమాల్లో కెల్లా ఈ సినిమా భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ మూవీకి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రమీజ్ నవనీత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతు ఓంకార్, ఎడిటర్ అనిల్ పసల, సౌంగ్ సింక్ సినిమా. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
నటీనటులు: రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి తదితరులు
రైటర్, దర్శకత్వం: రాజేష్ జగన్నాధం
బ్యానర్స్: S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్
నిర్మాతలు: VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అనిల్ పసల
పీఆర్వో: సాయి సతీష్

Related posts