ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘అదే నీవు అదే నేను’

'Ade Nuvvu Ade Nenu' — a romantic thriller that achieved great success with audience acclaim
'Ade Nuvvu Ade Nenu' — a romantic thriller that achieved great success with audience acclaim
Spread the love

-ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్

“కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందించారు. “అదే నీవు అదే నేను” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంపై మూవీ నిర్మాత గోవిందు కాండ్రేగుల, చిత్ర దర్శకుడు కొండల్, ఇతర టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు కొండల్ మాట్లాడుతూ – మా “అదే నీవు అదే నేను” సినిమా జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. చూసిన వాళ్లంతా మూవీ అద్భుతంగా ఉంది, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉందని చెబుతున్నారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉందని, ఇలాంటి స్క్రీన్ ప్లే తాము చూడలేదని ప్రేక్షకులు చెబుతుండటం సంతోషంగా ఉంది. సినిమా ఫస్టాఫ్ లో మనకు కలిగే అపార్థాలు తొలగిపోయేలా సెకండాఫ్ లో మన వివాహ వ్యవస్థ గొప్పదనం చెప్పడం ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. గేటెడ్ కమ్యూనిటీలో ఆరు ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమిది. ఒక్క పోలీస్ పాత్ర లేకుండా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేయడమే ఒక ప్రయోగం. మా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాను మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీకు సినిమా నచ్చితే మరో 20 మందికి చెప్పండి. మాలాంటి కొత్త దర్శకులను, టీమ్ ను ఎంకరేజ్ చేయండి. అన్నారు.
నటీనటులు – త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు
టెక్నికల్ టీమ్:
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
లిరిక్స్ – పూర్ణాచారి
డైలాగ్స్ – వై.అమ్మిరాజు
డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ – కనిష్క
ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు
స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్