సీత పాత్రకు నో చెప్పిన ఆలియా భట్‌!

Alia Bhatt said no to the role of Sita!
Spread the love

రామాయణ ఇతివృత్తంతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం కూడా రామాయణ ఇతివృత్తంతో వచ్చిన విషయం అని తెలిసిందే. ‘ఆదిపురుష్‌’ లో జానకి పాత్రను బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ పోషించింది. ఇక గత కొన్నాళ్లుగా మధు మంతెన రామాయణం కథతో సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నితీష్‌ తివారి, రవి ఉద్వావర్‌ దర్శకత్వంలో ఈ సరికొత్త రామాయణం సినిమా మూడు లేదా నాలుగు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం. రాముడి పాత్రకు గాను రణబీర్‌ కపూర్‌ ను దాదాపుగా ఖరారు చేశారని తెలిసింది. ఇక జానకి పాత్రకు గాను ఆలియా భట్‌ ను సంప్రదించడం జరిగింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా మళ్లీ షూటింగ్స్‌ తో బిజీ అవుతోంది. అయితే రామాయణం సినిమాలో భర్తతో కలిసి నటించేందుకు ఆలియా నో చెప్పిందట. బిజీ షెడ్యూల్‌ అంటూ ఆమె జానకి పాత్రను చేసేందుకు నో చెప్పిందని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సీత పాత్రను చేసిన ఆలియా భట్‌ మెప్పించలేక పోయింది. ఆ పాత్ర ఆలియాతో పాటు ఆమె అభిమానులకు కూడా నిరాశను మిగిల్చింది. అందుకే జానకి పాత్ర ను చేసేందుకు ఆలియా కి ఆసక్తి లేదని తెలుస్తోంది. ముందు ముందు జానకి పాత్రకు మేకర్స్‌ ఎవరిని ఎంపిక చేస్తారో చూడాల్సిందే…!

Related posts

Leave a Comment