యశ్ హీరోగా మళయాల దర్శకురాలు గీతూమోహన్ దాస్ ‘టాక్సిక్’ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్ పోస్ట్ పెట్టారు. ఆయన్ని టీమ్‌లోకి ఆహ్వానిస్తూ మూవీ యూనిట్ పంపిన లెటర్‌ను షేర్ చేశారు. ‘విూలాంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి పనిచేసేందుకు ‘టాక్సిక్’ టీమ్ ఆసక్తిగా ఉంది’ అంటూ అక్షయ్‌ను ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించింది మూవీ యూనిట్. ఈ చిత్రం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఇందులోని నటీనటులు గురించి వెల్లడించలేదు. మొదటిసారి అక్షయ్ భాగమైనట్లు తెలుపుతూ పోస్ట్ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఏడాదిలో అక్షయ్.. ‘టాక్సిక్’తో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యశ్ నటిస్తోన్న 19వ చిత్రమిది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.. అన్నది ఉపశీర్షిక. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.’కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...