అక్షయ్ కుమార్, టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల !!!

Soldiers Akshay Kumar and Tiger Shroff fight their villain Prithviraj in this action-packed teaser of Bade Miyan Chote Miyan!
Spread the love

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్… యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ తో ఇంప్రెస్ చేసింది. టీజర్ లో… “ప్రళయం రాబోతోంది… ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిషత్తు కాలలను మార్చివేస్తుంది… ఆ మహా ప్రళయం మంచి చెడులు మధ్య సంఘర్షణలను శాస్వితంగా నిర్ములిస్తుంది”… అంటూ సాగే డైలాగ్ గూజ్బమ్స్ తెప్పిస్తుంది.
ఈ సినిమాకు ఏక్ థా టైగ‌ర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకుంది. అదే తరహాలో టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.

Related posts

Leave a Comment