వాస్తవానికి అద్దంపట్టే కథ.. ఆలోచింపజేసే డైలాగులతో ఆకట్టుకున్న ‘రాజధాని ఫైల్స్’ థియేట్రికల్ ట్రైలర్!

Actually a mirror story.. Theatrical trailer of 'Rajdhani Files' impressed with thought provoking dialogues!
Spread the love

శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్, వీణ నటులుగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నటులు వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. వాస్తవ పరిస్థితులని అద్దం పడుతూ, రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనను ఎంతో సహజంగా, అందర్నీ ఆలోచింపజేసేలా ప్రజెంట్ చేసిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా’ ‘ఏడాది కాకపోతే.. నాలుగేళ్ళకైనా చదును చేస్తాం.. పంటలు పండిస్తాం.. రైతులంరా..’ ‘మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. మహా పాదయాత్ర’ అనే డైలాగులు చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ లతో పాటు నటీనటులంతా చక్కని పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వాస్తవ సంఘటనలని కథగా తీసుకొని, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు దర్శకుడు భాను. మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపధ్య సంగీతం ట్రైలర్ లో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. వాస్తవాన్ని అద్దంపట్టే కథ, ఆలోచింపజేసే డైలాగులు, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే నేపధ్య సంగీతంతో ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.
ఈ చిత్రానికి రమేష్ డీవోపీ పని చేస్తుండగా, కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటర్. గాంధీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.
నటీనటులు: అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, షణ్ముఖ్ , విశాల్, మధు, అజయరత్నం, అంకిత ఠాకూర్, అమృత చౌదరి తదితరులు
టెక్నికల్ టీం:
బ్యానర్: తెలుగువన్ ప్రొడక్షన్స్
సమర్పణ: హిమబిందు
నిర్మాత: కంఠంనేని రవిశంకర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాను
సంగీతం: మణిశర్మ
డీవోపీ: రమేష్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్ రావు
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గురుచరణ్, వెనిగళ్ల రాంబాబు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
కొరియోగ్రాఫర్: గణేష్
స్టంట్స్: నందు, రామకృష్ణ, జీవన్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ
పీఆర్వో: వంశీ-శేఖర్

Related posts

Leave a Comment