వైరల్‌గా మారిన నటి అనన్య నాగళ్ల వ్యాఖ్యలు.. నెటిజన్ల కామెంట్‌లకు కౌంటర్‌!!

Actress Ananya Nagalla's comments which have gone viral.. Counter to netizens' comments!!
Spread the love

నటి అనన్యా నాగళ్ల సోషల్‌ విూడియాలో షేర్‌ చేసిన ఓ వీడియోకు వస్తోన్న విమర్శలపై ఆమె స్పందించారు. ఎందుకింత నెగటివిటీ అంటూ అసహనాన్ని వ్యక్తంచేశారు. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించమని ఇటీవల నేనొక వీడియో షేర్‌ చేశా. దాన్ని కొందరు తప్పుబడుతూ విమర్శించారు. ఏదో చిన్న విషయం చెప్పా. నచ్చితే చేయండి.. లేకపోతే లేదు. ఎందుకింత నెగిటివిటీ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆమె స్ట్రా లేకుండా కొబ్బరి బొండం నీళ్లు తాగుతూ కనిపించారు. సాధారణంగా నేను స్టీల్‌ స్ట్రా వెంట తెచ్చుకుంటాను. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయని రాసుకొచ్చారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆమె అభిప్రాయాన్ని తప్పుబట్టారు.’విూ పక్కన ఉన్న ఆవిడకు ముందు చెప్పండి. ఆమె స్ట్రాతో తాగుతున్నారని కామెంట్స్‌ చేశారు. నెటిజన్ల కామెంట్‌లకు అనన్యా కౌంటర్‌ ఇచ్చారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన అనన్య నాగళ్ల 2019లో విడుదలైన ‘మల్లేశం’తో ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఆదరణ సొంతం చేసుకున్నారు. ‘ప్లే బ్యాక్‌’, ‘వకీల్‌సాబ్‌’, ‘శాకుంతలం’ వంటి చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన ‘పొట్టేల్‌’ అక్టోబర్‌ 25న విడుదల కానుంది.

Related posts

Leave a Comment