AAY Movie Review in Telugu : ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు మిత్రుల నవ్వుల నజరానా!

AAY Movie Review in Telugu :
Spread the love

ఎన్టీఆర్ బావమర్ది నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘ఆయ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు (ఆగస్టు 15)న ప్రీమియర్స్ వేశారు.

కథ : కరోనా వచ్చిన కొత్తల్లో ఈ కథ జరుగుతుంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ తో గోదావరి జిల్లాల్లోని తన ఊరికి వస్తాడు. కార్తిక్ కి వాళ్ళ నాన్న అడబాల బురయ్య(వినోద్ కుమార్) అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పట్నుంచి సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి) హరి(అంకిత్ కొయ్య), కార్తీక్ ఫ్రెండ్స్. కార్తిక్ ఊళ్లోకి వచ్చాడని తెలియడంతో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అతనితో తిరుగుతారు. ఓ రోజు కార్తీక్ పల్లవి(నయన్ సారిక)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కార్తీక్. ఆ అమ్మాయి వెనక తిరిగి పరిచయం అయి ప్రేమలో పడతారు. కానీ ఓ రోజు కార్తీక్ క్యాస్ట్ తమ క్యాస్ట్ ఒకటి కాదని ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకుంటుంది పల్లవి. అడిగితే క్యాస్ట్ వల్లే అని చెప్తుంది. పల్లవి వాళ్ళ నాన్నవీరవాసరం దుర్గ(మైమ్ గోపి)కి క్యాస్ట్ పిచ్చి ఎక్కువ. ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరని తెలిసి ఇద్దరు విడిపోదామనుకొని చివరిసారిగా కలుస్తారు. కానీ అదే సమయంలో పల్లవి మామయ్య వీళ్ళని చూస్తాడు. మరి పల్లవి – కార్తీక్ ప్రేమ సఫలమైందా? వాళ్ళ ప్రేమ ఇంట్లో తెలిసిందా? కార్తీక్ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి చేసే అల్లరి పనులేంటి? కార్తీక్ ప్రేమ కోసం ఫ్రెండ్స్ ఏం చేసారు? కార్తీక్ కి, వాళ్ళ నాన్నకి మధ్య ఉన్న విబేధాలు ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ.. ఆయ్ సినిమాలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో వర్షాకాలంలో ఈ సినిమాని చాలా అందంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్ గా నవ్వించడంతో పాటు లవ్ ఎమోషన్ ని, తండ్రి – కొడుకుల ఎమోషన్ ని పండించారు. అయితే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు కొంచెం సాగదీసినట్టు అనిపించినా క్లైమాక్స్ లో ఓ మంచి ఎలివేషన్ తో ట్విస్ట్ ఇచ్చి అదరగొట్టారు. ఒక సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి అంశాన్ని చాలా కామెడీగా చక్కగా చూపించారు. కామెడీ మాత్రం ఫుల్ గా వర్కౌట్ అయింది. ఓ ఐటెం సాంగ్ మాత్రం అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ బామ్మర్ది అవడంతో సినిమాలో చాలా ఆచోట్ల హీరో వెనక ఎన్టీఆర్ బ్యానర్లు, బొమ్మలు వచ్చేలా పెట్టడంతో పాటు వేరే హీరోల రిఫరెన్స్ లు కూడా వాడుకున్నారు. సీనియమా ముందు నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్తూ ప్రమోట్ చేసారు. దానికి తగ్గట్టే సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టుని కూడా కామెడిగానే చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ ఊరికి రావడం, ఫ్రెండ్స్ తో అల్లరిగా తిరగడం, పల్లవితో ప్రేమలో పడటం, ఫ్రెండ్స్ చేసే కామెడీతో సాగుతుంది. ఇంటర్వెల్ కి పల్లవి ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకొని షాక్ ఇస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఇక సెకండ్ హాఫ్ లో కార్తీక్ బాధ, అతని ఫ్రెండ్స్ చేసే కామెడీతో పాటు వాళ్లిద్దరూ ఎలా కలుస్తారో చూపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే.. నార్నె నితిన్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సింపుల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి మాత్రం కామెడీతో ఫుల్ గా నవ్వించారు. నయన్ సారిక సోషల్ మీడియాలో ఫేమస్ అమ్మాయిగా గలగలా మాట్లాడుతూ మెప్పిస్తుంది. కార్తీక్ తండ్రిగా వినోద్ కుమార్, పల్లవి తండ్రిగా మైమ్ గోపి, సరయు, యూటీవీ గణేష్.. మిగిలిన నటీనటులు తమ పాత్రలు పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీకల్ విషయాల కొస్తే… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా, కామెడీగా ఉంది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ బాగున్నాయి. గోదావరి ఊళ్ళల్లో తీయడం, ఎక్కువ షూట్ వర్షాకాలంలో తీయడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. లొకేషన్స్ కూడా చాలా ఆహ్లాదకరమైన లొకేషన్స్ పట్టుకున్నారు. దర్శకుడిగా అంజి ఒక రెగ్యులర్ కథని, సీరియస్ సబ్జెక్టుని తీసుకొని కామెడీగా మంచి కథనంతో రాసుకొని చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టారు. మొత్తంగా ‘ఆయ్’ సినిమా ఓ ముగ్గురుమిత్రులు చేసే అల్లరి, ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లమ్ ని కామెడీగా చూపించి నవ్వించారు.
‘ఆయ్’ మూవీ రేటింగ్ :3.5/5

*

Related posts

Leave a Comment