ఆమీర్ ఖాన్ ‘మహా భారతం’లో బన్నీ!?

Aamir Khan as Bunny in 'Mahabharat'!?
Spread the love

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ను ఇటీవల అల్లు అర్జున్‌ కలిశారు. ముంబయిలోని ఆయన నివాసానికి వెళ్లిన బన్నీ ఆమిర్ తో కలిసి కొంత సమయం ముచ్చటించారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతుండగా.. అభిమానులు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందేమోనని ఆశిస్తున్నారు. ఇటీవల ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘మహా భారతం’ గురించి తెలిపారు. అందులో అగ్ర కథానాయకులు భాగం కానున్నట్లు చెప్పారు. దీంతో బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో నటించనున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఇందులో ఆయన ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్‌ లాస్‌ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థను ఇటీవల సంప్రదించారు. ఇందులో హాలీవుడ్‌ తరహాలో విజువల్స్‌ ఉండనున్నట్లు తెలిపారు.

Related posts

Leave a Comment