ఓ ధ‌ర్మం క‌థే ‘స‌ర్వం శ‌క్తిమ‌యం’.. ఆహాలో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్..

A Dharma Kathe 'Sarvam Shaktimayam'.. streaming from October 20 on Aha..
Spread the love

ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు బీవీఎస్ రవి కథను అందించారు. అంకిత్, వినయ్ చద్దా, కౌముది కే నేమని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు.
ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఓ శ్రీమంతుడు తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయి. ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుంది. మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశక్తి పీఠాల మహత్యం చెప్పేలా వెబ్ సిరీస్ రానుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో జ‌రిగింది..ఈ సంద‌ర్భంగా….

రచయిత బీవీఎస్ ర‌వి మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు, క‌ళ్యాణ్ కృష్ణ‌, ఐఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేష్ రంజ‌న్‌గారు, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిగారు అందించిన స‌పోర్ట్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వారి వ‌ల్లే మేం 18 శ‌క్తిపీఠాల గ‌ర్భ‌గుడిలో మేం షూటింగ్ చేసుకునే అవ‌కాశం క‌లిగింది. అందుకు వారికి ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు. ఈ సిరీస్ చేయ‌టానికి ముందు నేను అమ్మ‌వారి గురించి చాలా పుస్త‌కాలు చ‌దివాను. అయితే జీవితంలో కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ప్పుడు దేవుడి వైపుకో, న‌మ్మ‌కాల వైపుకో మ‌నం వెళ్లిపోతాం. ఓసారి దుర్గ అమ్మవారిని పూజించాల‌ని ఒక మిత్రుడు స‌ల‌హా ఇచ్చాడు. అద‌లా ఉన్నప్పుడు ఓ రోజు ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ అస్సాం కామాఖ్య నుంచి ఫోన్ చేసి త‌ప్ప‌కుండా వ‌చ్చి చూడు అని అన్నాడు. నేను వెళ్ల‌లేక‌పోయాను. త‌ను అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఇదే కాదు.. అష్టాద‌శ పీఠాల‌ను చూడాల‌ని ప‌ట్టుబట్టాడు. దీనిపై సాంగ్ చేయాల‌ని కూడా అన్న‌ప్పుడు అస‌లు అలా ఫొటోలు, వీడియోలు చేస్తే ఎవ‌రు చూస్తార‌ని అనుకుంటున్న‌ప్పుడు విజ‌య్ చాడాగారు నాకు ఫోన్ చేశారు. ఆయ‌న వ‌ల్ల‌నే స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్ రూపొందింది. ఆయ‌న ఫోన్ చేసి ఇలా అష్టాద‌శ శ‌క్తిపీఠాల గురించి తెలుసా అని అన్నాడు. కొంచెం తెలుసు అని అన్నాను. అప్పుడాయ‌న‌. దీనిపై మ‌నం వెబ్ సిరీస్ చేయాల‌ని చెప్పి బెంగుళూరుకి పిలిచారు. 18 శ‌క్తి పీఠాల‌ను ద‌ర్శించ‌టం సాధార‌ణ విష‌యం కాదు. ఇంత టెక్నాల‌జీ ఉన్నప్పుడు దీన్ని అంద‌రికీ చూపించాల‌ని అన్నారు. అలాగే సాధార‌ణంగా చూపిస్తే ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూడ‌రు కాబ‌ట్టి దీనికొక క‌థ ఉండాలి. ప‌ది కాలాల పాటు నిలిచిపోయేలా ఉండే ధ‌ర్మం గురించి చెప్పాల‌ని అన్నారు. న్యాయం, చ‌ట్టం మారుతుందేమో కానీ ధ‌ర్మం మార‌దు. కాబ‌ట్టి దాని గురించి ఇందులో చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఓ నాస్తికుడు దేవుడు లేడ‌ని నిరూపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు పామ‌రుడు నుంచి విజ్ఞాని వ‌ర‌కు ధ‌ర్మం గురించే చెబుతారు. ప‌నిని పూజిస్తే దేవుడ్ని పూజించ‌టం కంటే గొప్ప‌ద‌ని చెప్పే ధ‌ర్మం క‌థే స‌ర్వం శ‌క్తిమ‌యం. హేమంత్ మ‌ధుక‌ర్ లేక‌పోతే ఇది పూర్తయ్యేది కాదు. ప్ర‌దీప్ ఎంతో గొప్ప ద‌ర్శ‌కుడు కాబోతున్నారు. సిరాశ్రీగారికి థాంక్స్‌. అక్టోబ‌ర్ 20న స‌ర్వం శ‌క్తిమ‌యం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ మ‌ద్దాలి మాట్లాడుతూ ‘‘సర్వం శక్తిమయం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌. దీనికి సంబంధించి ముందుగా మా బీవీఎస్ ర‌విగారికి థాంక్స్ చెప్పాలి. పూరిగారి వ‌ల్ల ర‌విగారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. కోవిడ్ స‌మ‌యంలో అమ్మ‌వారి అష్టాద‌శ పీఠాలు గురించి దీన్ని తెర‌కెక్కించాల‌నుకుని నన్ను పిలిచి ర‌విగారు మాట్లాడి ఆ స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చారు. కిర‌ణ్‌గారు, హేమంత్‌గారు, సిరాశ్రీగారు అంద‌రూ త‌మ స‌పోర్ట్‌ను అందించారు. ఈ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 20న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ‘‘గొప్ప యోగం ఉంటే త‌ప్ప ఇలాంటి వెబ్ సిరీస్‌ను చేయ‌లేరు. దేవుడంటే న‌మ్మ‌కం. ప‌ర‌మాద్భుత‌మైన కాన్సెప్ట్‌. క‌ళాత్మ‌క వ్యాపారం చేస్తున్న మ‌న‌కు దీన్ని చూస్తే తీర్థం తీసుకున్న‌ట్లు ఉంటుంది. సంస్కృతంలో సిరాశ్రీ ఎంతో గొప్ప‌గా పాట‌ను రాశారు. సంక‌ల్పం గొప్ప‌దైన‌ప్పుడు ఇలాంటి అద్భుతాలు జ‌రిగాయి. ఈ వెబ్ సిరీస్‌ను చూడ‌ట‌మే కాదు.. కుదిరితే ఆష్టాద‌శ పీఠాల‌ను ద‌ర్శించాల‌ని కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక ఆరంభం అని అనుకుంటున్నాను’’ అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘ఇదేదో ప్రాజెక్ట్ కాదు.. ఇదొక గొప్ప ప్ర‌య‌త్నం. ర‌వికి వ‌చ్చిన ఆలోచ‌న‌, హేమంత్‌గారు అత‌న్ని క‌ల‌వ‌టం ఇవ‌న్నీ చూస్తుంటే అమ్మ‌వారి సంక‌ల్పం అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయ‌టం అనేది దైవ సంక‌ల్పం. దేవుడికి ఆది లేదు, అంతం లేదు. ఆయ‌నొక రూపం లేదు. ఎన‌ర్జీకి ఇచ్చే ప్ర‌తీ నిర్వ‌చ‌నం దేవుడికి స‌రిపోతుంది. హిందూ మ‌తం వేరు, హిందూ ధ‌ర్మం వేరు. మ‌న దేశం హిందూ ధ‌ర్మం మీద‌నే సాగుతుంది. దీన్ని అంద‌రూ అంగీక‌రించాల్సిందే. ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయ‌టం అనేది అమ్మ‌వారి ఆశీర్వాద‌మే అని చెప్పుకోవాలి. ఇది ఎవ‌రూ అనుకుని చేసింది కాదు.. ఒక సంక‌ల్పం. ఇలాంటి స‌మ‌యంలో ఈ వెబ్ సిరీస్ రావ‌టం అనేది దైవ సంక‌ల్పం అనాలి. ప్ర‌దీప్ మ‌ద్దాలి వంటి యంగ్ డైరెక్ట‌ర్‌తో దీన్ని ముందుకు తీసుకురావ‌టం గొప్ప విష‌యం. కుటుంంబ స‌భ్యులంతా క‌లిసి చూసేలా ఈ వెబ్ సిరీస్ వ‌స్తుంది’’ అన్నారు.

యాక్ట‌ర్ సుబ్బ‌రాజు మాట్లాడుతూ ‘‘రవి ఇందులో చాలా మంచి రోల్ ఇచ్చారు. జీవితంలో అనేక స‌మ‌స్య‌లుంటాయి. అది ప‌క్క‌వాడి సాయంతో స‌రిపోయేది కాదు. ఓ మ‌నిషి త‌న వ్య‌క్తిగ‌త‌, మాన‌సిక బ‌లం ఏంటో తెలుసుకోగ‌లిగితే అంత కంటే గొప్ప విష‌యం మ‌రోటి ఉండ‌దు. అలాంటి స‌ల‌హాను ఇచ్చే పాత్ర‌లో నేను క‌నిపిస్తాను. డైరెక్ట‌ర్ ప్ర‌దీప్‌, ర‌వి స‌హా అంద‌రూ చ‌క్క‌గా రూపొందించారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సిరీస్ అనొచ్చు. మ‌నిషికి శ‌క్తినిచ్చే శ‌క్తి క‌థే స‌ర్వం శ‌క్తి మయం’’ అన్నారు.

నిర్మాత కౌముది కె.నేమాని మాట్లాడుతూ ‘‘ఏదేనా మ‌నం బ‌లంగా అనుకుంటే అది జ‌ర‌గుతుంది. స‌ర్వం శ‌క్తి మ‌యం విష‌యంలోనూ నేను అదే నమ్ముతున్నాను. నా టీమ్ ఎంతో కీల‌క పాత్ర‌ను పోషించింది. ప్ర‌దీప్‌గారు స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. అక్టోబ‌ర్ 20న స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్ ఆహాలో రిలీజ్ కానుంది’’ అన్నారు.

నిర్మాత విజ‌య్ చాడ మాట్లాడుతూ ‘‘కోవిడ్ ముందే సర్వం శక్తి మయం సిరీస్‌ను ప్రారంభించాం. అయితే ఎక్క‌డా ఏ స‌మ‌స్య రాలేదు. అక్టోబ‌ర్ 20న ఆహాలో ఇది స్ట్రీమింగ్ కానుంది’’ అన్నారు.

హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ ‘‘ఓరోజు ర‌వి నాకు ఫోన్ చేసి ఇలా అష్టాద‌శ పీఠాల‌పై సిరీస్ చేయాల‌నుకుంటున్నాం అనగానే, ఓ గుడికి వెళ్లి దాన్ని తెర‌కెక్కించ‌ట‌మంటేనే చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది. అలాంటి 18 శ‌క్తి పీఠాల‌పై ఇలాంటి సిరీస్ చేయ‌ట‌మంటే మామూలు విష‌యం కాదు. ఎవ‌రు నిర్మాత అని అడిగితే విజ‌య్ చాడ ఆయ‌న ఫ్రెండ్ అని చెప్పారు. ఖ‌ర్చుతో కూడిన ప‌ని. దీనికి ధైర్యం చెప్పి ముందుక న‌డిపించిన మా నిర్మాత‌లు విజ‌య్‌గారు, కౌముదిగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. సుబ్బ‌రాజు స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు’’ అన్నారు.

సిరా శ్రీ మాట్లాడుతూ ‘‘సిద్ధాంతం ఆగిన చోట వేదాంతం మొదలవుతుంది. ఈ వెబ్ సిరీస్ లైన్ చెప్పిన‌ప్పుడు ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఎన‌ర్జీ అనేది ప‌వ‌ర్‌, టైమ్ క‌ల‌యిక అనే ఐడియా వ‌చ్చింది. అక్క‌డి నుంచి ఈ సిరీస్ ప్రారంభ‌మైంది. మ‌న అంద‌రి క‌థే ఇది. భ‌క్తి అనేది ఏంట‌నే దానికి ఆన్స‌ర్ ఉంది. గుడ్డిగా కాకుండా ఎలా అప్ల‌య్ చేయాల‌నే దానిపై కూడా ఇది చెబుతుంది. కుటుంబం అంతా క‌లిసి చూసే వెబ్ సిరీస్ ఇది’’ అన్నారు.
’’

Related posts

Leave a Comment