విశాల్ ప్యాన్ ఇండియా మూవీగా ‘మార్క్ ఆంటోనీ’, టైటిల్ పోస్టర్ రిలీజ్

Mark antony vishal hero pan india movie
Spread the love

వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా నటిస్తున్న 33వ చిత్రానికి మార్క్ ఆంటోనీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. మార్క్ ఆంటోనీ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య మార్క్ ఆంటోనీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
మార్క్ ఆంటోనీ టైటిల్ పోస్టర్ చూస్తే షాట్ గన్ పట్టుకున్న కథానాయకుడు యుద్ధరంగంలో స్కెలిటన్స్ మధ్య నడుస్తూ వెళ్లడం కనిపిస్తోంది. విశాల్ సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మార్క్ ఆంటోనీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న మార్క్ ఆంటోనీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. త్వరలో ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.
నటీనటులు – విశాల్, ఎస్ జే సూర్య
సాంకేతిక నిపుణులు:
రచన దర్శకత్వం – అధిక్ రవిచంద్రన్
నిర్మాత – ఎస్ వినోద్ కుమార్
బ్యానర్ – మినీ స్టూడియో
పీఆర్వో – వంశీ శేఖర్

Related posts

Leave a Comment