తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ పానెల్ ఘనవిజయం

Vallabhaneni Anil Panel wins a landslide victory in Telugu Cine and TV Junior Artist Union elections
Spread the love

ఈ రోజు జరిగిన తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ పానెల్ ఘనవిజయం సాధించింది. వల్లభనేని అనిల్ కుమార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రవి సెక్రటరీగా, రవీందర్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ యూనియన్ కు స్వామి ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో మొత్తం 4 వేల ఓటర్లు ఉండగా, వల్లభనేని అనిల్ కుమార్ 1390 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందడం విశేషం. విజయం అనంతరం..నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ – మా షూటింగ్, మా పేమెంట్ అనే నినాదంతో ఈ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి సభ్యుడికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా సినీ, టీవీ జూనియర్ ఆర్టిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ఈ విజయం మా ఆర్టిస్టులకు అంకితం. ఎక్కడ అన్యాయం జరిగినా ఉపేక్షించకుండా మరోసారి తప్పులు జరగకుండా చూసుకుంటాం. షూటింగ్స్, పేమెంట్స్, ఏజెంట్స్ నుంచి రావాల్సిన బకాయిలు..ఇలా అన్ని విషయాల్లో మీకు న్యాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో జూనియర్ ఆర్టిస్టులకు ఉపాధి, ఆరోగ్య భద్రత వంటి అన్నింటా మంచి జరిగేలా ప్రయత్నిస్తాం. అన్నారు.

Related posts