‘రాజా సాబ్’కు తొలిరోజు 112 కోట్ల గ్రాస్ వసూళ్లు

'Raja Saab' earns Rs 112 crore on first day
'Raja Saab' earns Rs 112 crore on first day
Spread the love

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాజా సాబ్” మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు “రాజా సాబ్” ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా “రాజా సాబ్” నిలుస్తోంది.  ఈ చిత్రంలోని హారర్, ఫాంటసీ ఎలిమెంట్స్ ను యూత్, చిల్డ్రన్ తో టు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు. “రాజా సాబ్” చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు. హ్యూజ్ ఓపెనింగ్స్ తో మొదలైన “రాజా సాబ్” బాక్సాఫీస్ జర్నీ ఈ సంక్రాంతి హాలీడేస్ లో మరింత సక్సెస్ ఫుల్ గా సాగనుంది.