‘భోళా శంకర్‌’లో తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!

'భోళా శంకర్‌'లో తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!
Spread the love

మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే తన మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’ లోని ఒక పాట చిత్రీకరణ నుంచి వీడియోను లీక్ చేశారు. ప్రధాన తారాగణంతో కూడిన జామ్ జామ్ జజ్జనక అనే పాట ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజాగా చిరంజీవి మరో వీడియో లీక్ చేశారు. ఈ వీడియో అభిమానులు, ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి. ‘‘మా కళ్యాణ్‌ బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకురావడం, నా పాటలకి స్టెప్పులేయడం, నా డైలాగులను ఇమిటేట్ చేసి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్ టైనర్ చేస్తుంటారు. అదే విధంగా నేను మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ‘భోళాశంకర్‌’లో తన పాట, మేనరిజమ్స్‌ ని ఇమిటేట్ చేయడం జరిగింది” అని చెప్పిన మెగాస్టార్.. ‘ఖుషి’ సినిమాలో యే మేరా జహా పాట లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ని అనుకరిస్తున్న చిన్న గ్లింప్స్ ని పంచుకున్నారు. ఈ వీడియోలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా కనిపించారు.
అనిల్ సుంకర యొక్క ఎకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్ , సుశాంత్ ఇతర ప్రధాన తారాగణం.
డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా
సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

Related posts

Leave a Comment