మే9న ‘6జర్నీ’ విడుదల

'6Journey' releases on May 9th
Spread the love

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే9న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా…
దర్శకుడు బసీర్ ఆలూరి మాట్లాడుతూ.. ‘‘హీరో సమీర్ దత్‌గారు, పల్లవి రాథోడ్ మెయిన్ లీడ్స్‌గా టేస్టీ తేజ, రవిప్రకాష్ రెడ్డి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన మా ‘6జర్నీ’ మూవీని మే 9న విడుదల చేస్తున్నాం. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు దేశభక్తి ప్రధానంగా ఉండే కథాంశంతో సినిమాను రూపొందించాం. సినిమా తప్పకుండా మెప్పిస్తుంది’ అని అన్నారు.
హీరో స‌మీర్ ద‌త్త మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ లవ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘6జర్నీ’ తెర‌కెక్కింది. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. బ‌సీర్‌గారు సినిమాను బాగా తెర‌కెక్కించారు. నిర్మాత పాల్యం ర‌విప్ర‌కాష్‌రెడ్డిగారికి థాంక్స్‌. మే9 రిలీజ్ కాబోతున్న మా సినిమాను ఆశీర్వ‌దించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరోయిన్ ప‌ల్ల‌వి రాథోడ్ మాట్లాడుతూ ‘‘ బ‌సీర్‌గారు, ర‌విప్ర‌కాష్‌గారి స‌పోర్ట్‌తో సినిమాను ఎంతో బాగా తెర‌కెక్కించారు. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. మే9న మూవీ రిలీజ్ అవుతుంది. త‌ప్ప‌కుండా సినిమా అందిరికీ న‌చ్చుతుంది’’ అన్నారు.
నటి సాహితి మాట్లాడుతూ ‘‘6 జర్నీ మూవీలో సరస్వతి అనే మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ బసీర్‌గారికి థాంక్స్. అలాగే నిర్మాత రవిగారు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చి మాతో కలిసి ఆయన కూడా నటించారు. షూటింగ్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేశారు. సినిమాటోగ్రఫీ సురేందర్ రెడ్డిగారికి థాంక్స్. నాతో పాటు నటించిన సమీర్, పల్లవి, తేజ సహా అందరికీ థాంక్స్. మే9న సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
నిర్మాత పాల్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ల‌వ్‌, యాక్ష‌న్‌, మిస్ట‌రీ ..ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో 6జ‌ర్నీ మూవీని రూపొందించాం. ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ‌సీర్‌గారు సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. మే9న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మంచి చిత్రాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను స‌పోర్ట్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

Related posts

Leave a Comment