గేదెల రాజు రివ్యూ.. క్లాసిక్ మర్డర్ మిస్టరీ!

Gedela Raju Review.. A classic murder mystery!

సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితుడైన రఘు కుంచె ప్రధాన పాత్రలో, చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘గేదెల రాజు’. ‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం… కథా నేపథ్యం: కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు (రఘు కుంచె) కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. టికెట్ ఆశించిన మరో నేత దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్)తో రాజుకు విభేదాలు తలెత్తుతాయి. అయితే, ఊహించని విధంగా అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. ఈ హత్య వెనుక ఉన్నది రాజకీయ ప్రత్యర్థులా? లేక రిచ్‌-మీరా, విజయ్‌-సత్య వంటి యువ జంటలకు ఈ మరణంతో సంబంధం ఉందా? పోలీసు విచారణలో తేలిన షాకింగ్ నిజాలేమిటి అనేదే ఈ…