భారతీయ సంగీత ప్రపంచంలో మరో ధృవతార అస్తమించింది. తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది సంగీతాభిమానులను అలరించిన లెజెండరీ గాయని ఆశా భోస్లే ఏప్రిల్ 12, 2026న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోంస్లేది గాయనిగా సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించారు. చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని కృషికిగానూ పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా బిభూషన్ అవార్డులు ఆమెను వరించాయి.1943లో మరాఠీ చిత్రం ‘మజాబ్’తో ప్రారంభమైంది. అందులో ‘చలా చలా నవ్ చలా’ పాట పాడారు. 1948లో బాలీవుడ్ దర్శకుడు హంసరాజ్ బహల్ పిలుపుతో ముంబయి వెళ్లారు. 1954లో వచ్చిన ‘బూట్ పాలిష్’లోని పాటలతో ఆశాకు మంచి గుర్తింపు దక్కింది. ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే జో…
