Young and dynamic actor Akhil Akkineni’s next Lenin has raised a good buzz with the first single. The film stars Bhagyashri Borse as the female lead. Directed by Murali Kishor Abburu, Lenin is shaping up to be a complete cinematic package filled with powerful emotions and engaging storytelling. On the occasion of Akhil Akkineni’s birthday, the makers dropped a special poster wishing the actor a very happy birthday. In the poster, Akhil is seen in a new look, and his charming smile adds warmth. This much-anticipated project is set to…
Day: April 8, 2026
జూన్ 26న రానున్న‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త…
అతడే..ఆమె లక్కీ ఛార్మ్..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్, సిద్ధు జొన్నలగడ్డ వంటి స్టార్లు హాజరై చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. రణ్‌వీర్ సింగ్‌ను తన ‘లక్కీ ఛార్మ్’అని అన్నారు. “ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఒక నటిగా ఉన్నానంటే దానికి కారణం ఆయనే” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్ ఆరంభంలో రణ్‌వీర్‌తో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ వాణిజ్య ప్రకటనలో నటించానని అన్నారు. ఆ యాడ్ చూసిన తర్వాతే సినీ నిర్మాతలు తనను గుర్తించి అవకాశాలు ఇచ్చారని ఆమె వెల్లడించారు. రణ్‌వీర్…
‘ఐకాన్ స్టార్’కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘రాకా’ ఫస్ట్ లుక్ ను కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేశారు. బర్త్ డే బోయ్ ను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ లతోపాటు జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు ఉన్నారు. మీ అందర్నీ త్వరలోనే సావకాశంగా కలుస్తానని ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు!!
‘డెకాయిట్’ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో డౌట్ లేదు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. డెకాయిట్ ఈవెంట్ కు అందరూ…
