There is nothing special to say about star heroine Nayanthara. At that time, heroine Nayanthara impressed Telugu fans with the movie ‘Lakshmi’ and later she took the industry by storm. Not only in Telugu, Nayanthara has made a name for herself in all languages. However, such Nayanthara recently made a splash with the movie ‘Mana Shankar Varaprasad Garu’ starring Megastar Chiranjeevi. The movie was released as a Sankranthi gift the other day and became a success. However, despite her increasing age, Nayanthara’s craze is not decreasing at all. She has…
Month: March 2026
వాహ్..లక్కీ ఛాన్స్: మినీ ఫిలిమ్స్ భారీ ప్రాజెక్ట్ లో నయనతార
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ‘లక్ష్మి’ సినిమాతో తెలుగు అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్ నయనతార, ఆ తర్వాత ఇండస్ట్రీని దున్నేశారు. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో నయనతార తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి నయనతార ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో సందడి చేశారు. సినిమా మొన్న సంక్రాంతి కానుకగా వచ్చి సక్సెస్ అయింది. అయితే వయసు పెరుగుతున్నప్పటికీ నయనతార క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న ఆమె.. వరుసగా సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో స్టార్ హీరోతో కొత్త ప్రాజెక్టు దక్కించుకున్నారట. సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో నయనతారకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా…
ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్
* అదిరిపోయే అవతార్ లో కనిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన శక్తివంతమైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన, కమాండింగ్ అవతార్‌లో కనిపించిన ఈ గ్లింప్స్.. ప్రేక్షకులు తెరపై చూడటానికి ఇష్టపడే మాస్ ఎనర్జీ, చరిష్మాను సంపూర్ణంగా సంగ్రహించింది. ఈ గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రభావవంతమైన డైలాగులు,శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ అభిమానులు, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్న గ్లింప్స్ ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులచే ‘కల్ట్ కెప్టెన్’ అని ప్రశంసించబడే దర్శకుడు హరీష్ శంకర్, ప్రేక్షకులు ఆరాధించే విధంగా పవన్ కళ్యాణ్‌ను మరోసారి ఉత్తేజపరిచే…
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు
గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించిన 2025 సంవత్సరపు విజేతల జాబితా అధికారికంగా ప్రకటించబడింది. ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సినీ రంగంలో వివిధ విభాగాల్లో విజేతలుగా ఎన్నికయిన వారందరికీ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ఉత్తమ పుస్తక రచయితగా గద్దర్ అవార్డుకు ఎన్నికవ్వడం ఫిలిం క్రిటిక్స్ సభ్యులతో పాటు ప్రతీ సినిమా జర్నలిస్ట్ గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరుపున ప్రతీ విజేతకు హృదయపూర్వక అభినందనలు. విజేతలైన ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్) ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా ఉత్తమ…
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025 : చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ విజేతలను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కార వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల జాబితా ఫైనల్ లిస్ట్ ను అందజేశారు. అనంతరం అవార్డు విన్నర్‌లను ప్రకటించారు. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది. 2025 సంవత్సరానికిగానూ సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు పలు ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని వరించింది. పైడి జయరాజ్ అవార్డు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను, బీఎన్ రెడ్డి అవార్డు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు…
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ …రొటీన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్!
హీరో శివాజీ – లయ కాంబినేషన్ మన టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకటిగా బాగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మొదట ఓటిటికి ప్లాన్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం (మార్చి 6, 2026) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? తెలుసుకుందాం… కథ: శ్రీరామ్ అన్నమయ్య జిల్లా కొత్తపేటలో పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తుంటాడు. అతడు నీతి, నిజాయితీకి మారుపేరు. లంచాలు, అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు. అయితే భార్య ఉత్తర (లయ) మాత్రం అక్రమ సంపాదన కోసం భర్త శ్రీరామ్‌ను వేధిస్తుంటుంది. కొడుకు మిట్టు (రోషన్) తుంటరి పనులు చేస్తూ హింసకు పాల్పడుతుంటాడు. భార్య, కొడుకులతో వేగలేకపోతున్న సమయంలో విక్రమ్…
‘వారాణసి’ కోసం..పాన్ వరల్డ్ లెవెల్లో హైప్!
* గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రం కోసం ప్రియాంక చోప్రా ప్రమోట్ పాన్ వరల్డ్ లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న భారీ చిత్రాల్లో ఒకటే ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్ ప్రియాంక చోప్రా కలయికలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రాన్ని మాత్రం వరల్డ్ సినిమా దగ్గర ప్రియాంక చోప్రా ప్రమోట్ చేస్తున్నంత రీతిలో ఎవరూ చేయడం లేదనే చెప్పొచ్చు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రాకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె అక్కడి మీడియా దగ్గర వీలు దొరికినప్పుడు ఈ సినిమా చర్చని తప్పకుండా తీసుకొస్తుంది. ఇలా అనేక హాలీవుడ్ ఇంటర్వ్యూస్ లో ఆమె ‘వారణాసి’ ప్రస్తావన తీసుకువస్తుండడం ఈ సినిమాకి…
భూమి పెడ్నేకర్ : పవర్‌ఫుల్ పాత్రలవైపే మొగ్గు!
బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో, భూమి పెడ్నేకర్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎంచుకున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘వి ది విమెన్’, ‘విమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, తన కెరీర్‌లో చేసిన పొరపాట్ల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు కమర్షియల్ సక్సెస్ కోసం, అంటే రూ. 200 కోట్ల బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలనే ఆత్రుతతో కొన్ని పాత్రలు అంగీకరించానని ఆమె ఒప్పుకున్నారు.. ‘నేను కొన్ని తప్పులు చేశాను. ఆ పాత్రలను నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నా జెండర్‌ను (స్త్రీత్వాన్ని) అగౌరవపరిచేలా ఉండే పాత్రలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నాకు గౌరవం లేని చోట నేను ఉండను’ అని భూమి కుండబద్దలు కొట్టారు. ప్రజంట్ భూమి మాటలు వైరల్…
పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి..సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
హీరో విజయ్-త్రిష చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన తర్వాత ఈ జంట ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. ఓ నటితో విజయ్ ఉంటున్నాడని బీజేపీ నేత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పారు. అంతలోనే విజయ్ భార్య సంగీత కూడా బాంబ్ పేల్చింది. తన భర్త ఒక నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 2025 డిసెంబర్‌లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. భార్య…
జాన్వీ అందానికి అభిమానులు ఫిదా ..
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా వెండితెర ప్రయాణం ప్రారంభించిన జాన్వీ కపూర్ తన కూతురిని స్టార్ హీరోయిన్ గా చూడడం కోసం శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. కానీ, అది నెరవేరకుండానే ఆమె మరణించారు. అయినా కూడా తల్లి పేరును నిలబెట్టడానికి జాన్వీ తన వంతు కృషి చేస్తున్నారు. ‘దేవర’తో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా కూడా తంగం పాత్రలో జాన్వీ తెలుగు అభిమానులను ఫిదా చేశారు. ఇక ‘దేవర’ తరువాత జాన్వీ నటిస్తోన్న చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి…
