ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ గా మారిన సినిమానే ‘ధురంధర్ 2’. యువ దర్శకుడు ఆదిత్య ధర్, రణ్వీగ్ సింగ్ కలయికలో చేసిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గ్రాండ్ గా విడుదలకి వచ్చి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై అనేకమంది స్టార్ నటులు, దర్శకులు కూడా తమ స్పందన అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమాపై స్పందించడం జరిగింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఆకాశానికి ఎత్తేసారు. నిజంగా జరిగిన ఘటన లను కల్పిత పాత్రలతో తెరకెక్కించి ఒక అద్భుతమైన సినిమాని దర్శకుడు ఆదిత్య ధర్ అందించారు అని తెలిపారు. అలాగే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా నిడివి సమస్య తను నోటీస్ చేయలేదని కొన్ని…
Month: March 2026
‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదల
ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ‘నో వే హోమ్’ సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో…
మరో గొప్ప ‘మెగా’ ప్రయత్నం!
* ఉచిత విద్యా ప్రాజెక్ట్ పై చిరంజీవి దృష్టి వెండితెర రారాజుగా అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. “రక్తం ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో నేను అర్థం చేసుకున్నప్పుడు,…
బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ అవసరమే : కంగనా రనౌత్
బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటూ, ప్రేక్షకులను ఆకర్షించడం కోసం అన్ని హద్దులను దాటేస్తోందని స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా విమర్శించారు. చౌకబారు ట్రిక్కులతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్న సినీ పరిశ్రమ తీరును దేశమంతా ఛీకొడుతున్నా, వారికి ఏమాత్రం సిగ్గు ఉన్నట్లు అనిపించడం లేదని ఆమె మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతరకర ప్రదర్శనలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం బాలీవుడ్‌పై కచ్చితంగా కఠినమైన నియంత్రణ విధించాలని, అప్పుడే ఈ అశ్లీలతకు ఎండ్ కార్డ్ పడుతుందని కంగనా గట్టిగా నొక్కి చెప్పారు. అసలు ఈ వివాదం ‘కేడీ.. ది డెవిల్’ అనే కన్నడ చిత్రం కోసం రూపొందించిన హిందీ పాటతో మొదలైంది. ఈ పాటలోని సాహిత్యం పచ్చిగా, డబుల్ మీనింగ్ డైలాగులతో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా, ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్…
చిన్న నిర్మాతలే పరిశ్రమకు పెద్ద దిక్కు : ‘మీట్ ది ప్రెస్’లో చదలవాడ శ్రీనివాసరావు
* తెలుగు రాష్ట్రాల సీఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి * ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు చాలా ముఖ్యం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో ఆదివారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద ఈ కార్యక్రమం జరిగింది. అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఎంతో మంది సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో ‘మీట్ ది ప్రెస్’ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు’ పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా ఆయనకు శ్రీనివాసరావు గారి చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరిగింది.…
ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ పై మెగాస్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా – శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఉగాది కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం అభిమానుల్లో మంచి బజ్ ని పెంచింది. ఇక ఈ ట్రైలర్ పై మన టాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా ట్రైలర్ పై తమా స్పందన తెలియజేయడం వైరల్ గా మారింది. మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్”…
ప్రియదర్శి, సాయి కుమార్ ‘సుయోధన” టీజర్ విడుదల
ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ “సుయోధన” సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ట్రైలర్
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. పవర్, యాక్షన్, వినోదంతో నిండిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ను ట్రైలర్ వాగ్దానం చేస్తోంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వినోదభరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో తన…
తెలుగు రాష్ట్రాల్లో 27న ‘హ్యాపీ రాజ్’
భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘హ్యాపీ రాజ్ ఈ నెల 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా…
‘పదే పదే’ మనసుని హత్తుకునే మెలోడీ..
‘పదే పదే ప్రాణం నిన్నే కోరగా/ కలే నిజం కాదా నిన్ను చేరగా/ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా/ ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ`..అంటూ అమ్మాయి తన మనసులోని ప్రేమను అబ్బాయికి చెప్పటానికి ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించుకున్న అబ్బాయి కథేంటో తెలుసుకోవాలంటే ‘రాకాస’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ…
