తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2025 : చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం  

Telangana Gaddar Film Awards - 2025: Chiranjeevi wins NTR National Film Award

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2025’ విజేతలను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కార వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల  జాబితా ఫైనల్ లిస్ట్ ను అందజేశారు. అనంతరం అవార్డు విన్నర్‌లను ప్రకటించారు. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది. 2025 సంవత్సరానికిగానూ సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు పలు ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు మెగాస్టార్‌ చిరంజీవిని వరించింది. పైడి జయరాజ్‌ అవార్డు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను, బీఎన్‌ రెడ్డి అవార్డు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు…