శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ .వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా.. విజయమిత్ర దర్శకత్వంలో ‘100 డేస్ లవ్ స్టోరీ’అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘అతి ప్రేమ భయానకం’ అనేది క్యాప్షన్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాత సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘100 డేస్ లవ్ స్టోరీ’ చిత్రం ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉంది. ట్రైలర్ ని చూస్తే చక్కటి ప్రేమకథలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి క్యాప్షన్ గా ‘అతి ప్రేమ భయానకం’ని పెట్టడంలోనే సినిమా ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు అన్నారు. ప్రస్తుతం ప్రేమ పేరుతో సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. యువత ప్రేమ మోజులో జీవితాలను కోలోతున్నారు. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా…
Day: January 24, 2026
శోభిత ధూళిపాళ ‘చీకటిలో’కు ప్రముఖల ప్రశంసలు
శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రచకొండ ప్రధాన పాత్రలలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రైమ్ వీడియో చాలా కాలంగా భారతదేశంలో వినోదానికి వేదికగా ఉంది. వివిధ జానర్‌లలో అనేక ఐకానిక్ షోలు, సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఓటీటీలో ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రేమ్ వీడియో. తన అద్భుతమైన లైనప్‌కు జోడిస్తూ, ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల మరో ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ను తీసుకువచ్చింది. ఇది ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పినట్లుగానే ఆ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రేక్షకులతో పాటు ప్రముఖుల చేత ఒకే విధంగా ఆసక్తిని రేకెత్తించిన దాని ట్రైలర్ ఆ తర్వాత జనవరి 23న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రచకొండ ప్రధాన పాత్రలలో నటించిన ‘చీకటిలో’ ఒక సరికొత్త విభిన్నమైన కథను అందిస్తుంది. ఈ…
‘దేవగుడి’ ట్రైలర్ విడుదల : 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మీడియా మిత్రుల సమక్షంలో మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమా టీజర్ ను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేసి సపోర్ట్ అందించారు. ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ,…
