నవతరం హీరోల్లో నవీన్ పొలిశెట్టికి మంచి పేరుంది. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ మంచి కథలను ఎంచుకుంటున్నాడు. ఈ సంక్రాంతికి అలాంటి వినోదాన్ని పంచడానికి ‘అనగనగా ఒకరాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి యాక్సిడెంట్ కారణంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అందరూ భావించారు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సినిమాని నెక్స్ట్ లెవల్‌లో…
