ఈ సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలయిన చిత్రాల్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఒకటి. యువతరం కథానాయకుడు శర్వానంద్ విజయాన్ని చవిచూసి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, నిర్మాతల ప్లానింగ్‌తో ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 14, 2026న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం.. కథ: ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే గౌతమ్ (శర్వానంద్), అదే కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో…
