మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘మన శంకరవరప్రసాద్ గారు’గా సంక్రాంతికి బరిలోకి దిగారు. తన సినిమాలతో అపజయమే ఎరుగని, మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు తెలియడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా.. అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. సాధారణంగా మెగాస్టార్ సినిమా అంటే అంచనాలు కామన్. దానికి తోడు ప్రత్యేక పాత్రలో వెంకటేష్ తోడయ్యాడు. ఇంకేముందీ.. అంచనాలు అంబరాన్ని తాకాయి. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ…
