మ‌న పండ‌గ‌, మ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మ‌న తెలుగు జీ5.. సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ను ప్రారంభించిన రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్‌

Mana Pandaga, Mana Entertainment, Mana Telugu Zee5.. Rocking Star Manchu Manoj launches Sankranti festival celebration campaign

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ న‌టించిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ఆవిష్క‌రించింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల కోసం దీన్ని రూపొందించారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే జీ5 హామీ మ‌రింత ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. ‘మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది.సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. సంక్రాంతి సంద‌ర్భంగా రూపొందించిన సంప్ర‌దాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్.. పండుగ సంద‌ర్భంలో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య…

సరికొత్త వినోదాన్ని అందించే చిత్రం ‘అనగనగా ఒక రాజు’ : మీనాక్షి చౌదరి

'Anaganaga Oka Raju' is a film that offers new entertainment: Meenakshi Chowdhury

ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. అసలుసిసలైన పండగ సినిమాగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత నవీన్‌ పొలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘అనగనగా ఒక రాజు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల…

పవన్ కళ్యాణ్ : జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు

Pawan Kalyan: Historic world recognition in Japanese martial arts

పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.  సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే…

‘నారి నారి నడుమ మురారి’ హిలేరియస్ ట్రైలర్

'Nari Nari Nadu Murari' hilarious trailer

చార్మింగ్ స్టార్ శర్వా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’తో అలరించబోతున్నారు. ఈనెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ‘సామజవరగమన’ ఫేమ్ కామెడీ మాస్ట్రో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటల ద్వారా భారీ అంచనాలను పెంచింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ లో గౌతమ్(శర్వా) బి-టెక్ ఆర్కిటెక్ట్, తన గర్ల్ ఫ్రెండ్ (సాక్షి వైద్య)తో సాఫీగా సాగుతున్న అతడి జీవితం, ఒక్కసారిగా అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ (సంయుక్త) తిరిగి జీవితంలోకి రావడంతో గందరగోళంగా మారుతుంది. అక్కడి నుంచి మొదలయ్యే హిలేరియస్ పరిస్థితులు, గౌతమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ మధ్య నలిగిపోవడం ప్రేక్షకులకి నవ్వులు పంచాయి.…

‘రాజా సాబ్’కు 183 కోట్ల గ్రాస్ వసూళ్లు

'Raja Saab' grosses Rs 183 crores

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 183 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు మించిన కలెక్షన్స్ డే 3 దక్కించుకుందీ ప్రెస్టీజియస్ మూవీ. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా “రాజా సాబ్” నిలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు.…

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ : అలరించే ఎంటర్‌టైనర్‌!

Our Shankara Vara Prasad Garu Movie Review: A thrilling entertainer!

By -నవీన్ కుమార్ చెన్నం శెట్టి మెగాస్టార్‌ చిరంజీవి మూడేళ్ళ విరామం తర్వాత ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా ఆయన ‘భోళాశంకర్‌’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ చేశారు. అనేక కారణాలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు’ తెరమీదకు వచ్చింది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్రలో సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ నెల 12న సోమవారం…