హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో, మేధాశక్తి వికాసంలో చెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ క్రీడలో ఎదగాలంటే కష్టపడి సాధన చేయాల్సిందేనని, నిరంతర శ్రమే విజయానికి మార్గమని సూచించారు. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు ఆటలో సహజమని, గెలిచినా ఓడినా మళ్లీ మళ్లీ ఆడుతూ ముందుకు సాగితే ఒక రోజు తప్పకుండా విజయం వరిస్తుందన్నారు. పిల్లలలో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఏకాగ్ర అకాడమీలో శిక్షణ…
Year: 2025
‘బొమ్మ హిట్’ ప్రారంభం
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “బొమ్మ హిట్”. ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో హైదరా బాద్ లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ ను ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో.. హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ – ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్…
సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా ‘సోగ్గాడు’ స్వర్ణోత్సవం
నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్, రచయితలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో… రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – రచయితగా నన్ను నేను నమ్ముకుని 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఆ ఏడాది “సోగ్గాడు” సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు గారు హీరోగా ఒక్కో మెట్టు పైకి అధిరోహిస్తూ వెళ్లారు. శోభన్ బాబు గారికి మహిళా అభిమానులు ఎక్కువ. నా భార్య కూడా ఆయనకు అభిమాని. శోభన్ బాబు గారు ఎన్నో…
‘డెకాయిట్’ మైండ్ బ్లోయింగ్ టీజర్
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’ తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. శేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన తర్వాత, మేకర్స్ మరో అద్భుతమైన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లవ్ స్టొరీ, రూత్ లెస్ జర్నీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది. మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. క్యారెక్టర్ మల్టీ షేడ్స్‌తో ఆకట్టుకుంది. శేష్ రగ్గడ్ అవతార్‌లో కనిపించిన తీరు అదిరిపోయింది. మదనపల్లె యాసలో మాట్లాడిన…
‘ఓహ్’ మూవీ రివ్యూ : చూడ చక్కని రొమాంటిక్ డ్రామా!
ఆధునిక ప్రేమకు..పురాతన శాస్త్రాలకు మధ్య ఒక అద్భుత ప్రయాణం.. ‘ఓహ్’ సినిమా. ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో రఘు రామ్ – శృతిశెట్టి, నైనా పాఠక్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, భారతీయ పురాణాలు ప్రాచీన విజ్ఞానాన్ని జోడించి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. కథ : కృష్ణ (రఘురామ్), కావ్య (శృతి శెట్టి) అనే అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. అయితే, అతనికి ఉన్న ‘క్రోమోఫోబియా’ అనే వింత సమస్య కారణంగా దృశ్య (నైనా పాఠక్ ) అనే మరో అమ్మాయితో ఉన్న బంధాన్ని గుర్తుంచుకోలేకపోతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం.. మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ.. ఈ రెండింటి మధ్య కృష్ణ పడే…
సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ ప్రారంభం
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్ లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) గారు హైదరాబాద్ లోని పంజాగుట్టలో నూతనంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభించడం జరిగింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కత్తి శెట్టి వంటి ఎందరో స్టార్ హీరోయిన్లకు మేకప్ మాన్ గా పనిచేసిన చక్రి గారు తానే సొంతంగా ప్రారంభించిన ఈ నూతన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో కొన్నేళ్లుగా ఉంటూ పనిచేసిన సోదర సమానులు చక్రి అన్న సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో &…
ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీగా “గుర్రం పాపిరెడ్డి” ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది : ఫరియా అబ్దుల్లా
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. – “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో నేను సౌధామిని అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సౌధామిని నర్సుగా పనిచేస్తుంటుంది. డాక్టర్ చదువుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో గుర్రం పాపిరెడ్డి పరిచయమై తన కథంతా మార్చేస్తాడు. ఆయన గ్యాంగ్ తో కలిసి సౌధామిని ఒక దోపిడీలో…
ఘనంగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా వి. వి. సుమలతా దేవి ప్రమాణస్వీకారోత్సవం
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శ్రీమతి, వి. వి. సుమలతా దేవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం నాడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. ‘‘ఈ యూనియన్‌కు మొట్టమొదటి సారిగా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉంది. సుమలత గారి విజయం యూనియన్‌కు కొత్త రూపుని తీసుకు వస్తుందని నమ్ముతున్నాను. జానీ మాస్టర్ గారు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిన జానీ మాస్టర్ గారు, ఆయన సతీమణి…
Grand Swearing-in Ceremony of Smt. V. V. Sumalatha Devi as President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA)
Popular Choreographer Jani Master’s wife Smt. V. V. Sumalatha Devi was elected as the President of the Telugu Film and TV Dancers and Dance Directors Association (TFTDDA). In this regard, the swearing-in ceremony was grandly held in Hyderabad on Thursday. Srisailam Yadav and Jubilee Hills MLA Naveen Yadav attended the event as chief guests. At the event… Jubilee Hills MLA Naveen Yadav said… “I am happy that for the first time, a woman has been elected as the president of this union. I believe that Sumalatha’s victory will bring a…
ప్రేక్షకుడు పెట్టే టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాను : ‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మాతగా చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దర్శకుడు చిన్మయ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. * మాది కర్ణాటక. కన్నడ ఇండస్ట్రీలో నేను 17 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇప్పటికే నేను కన్నడ భాషలో రెండు చిత్రాలు తీశాను. తెలుగులో ‘జిన్’ నా మొదటి చిత్రం.…
