– బర్డ్ వాచర్ జర్నల్ ఆవిష్కరణ భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ అయిన వి. ఎ. మంగను అభినందించి సత్కరించారు. హైదరాబాద్ లో వారాంతంలో బర్డ్ వాచింగ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా చెరువులు, పార్కులు, అడవులు సందర్శిస్తున్నారని, వారిలో ఎక్కువ శాతం యువతరం ఉండటం సంతోషదాయకం స్ఫూర్తిదాయకం అని…
Day: November 19, 2025
పైరసీ ‘బొమ్మ’ లాటకు తెరపడింది
* పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు చిత్రసీమ ధన్యవాదాలు పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భరత్ భూషణ్ మాట్లాడుతూ… ” ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఐబొమ్మ అని పైరసీ వెబ్సైటు ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు. దీనికోసం కష్టపడి పనిచేసిన పోలీసు బృందానికి, ప్రభుత్వానికి, పైరసీ సెల్ వారికి కృతజ్ఞతలు తెలిపారురు . నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ… “చిత్ర పరిశ్రమ కోసం డిపార్ట్మెంట్ నుండి సీనియారిటీ ఉన్న పోలీసులు పని చేశారు. ఈ ప్రయత్నంలో విదేశి పోలీసులు కూడా మనకి…
పథకం ప్రకారమే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు
-మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతినిధి బృందం -కఠినచర్యలు తప్పవు కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా హామీ ఇచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్…
సీఎం రేవంత్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించిన రాహుల్ సిప్లిగంజ్
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.
