Court movie review : ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కోర్ట్‌’ డ్రామా!

Court movie review

‘కోర్ట్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేదికగా నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ…”ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా చూడండి అని ఎవర్నీ అడిగింది లేదు.. మొదటిసారి అడుగుతున్నా ‘కోర్ట్‌’ సినిమా చూడమని. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్‌ కాకూడదని. ఒకవేళ సినిమా చూసి నచ్చకపోతే.. త్వరలో రాబోతున్న నా ‘హిట్‌–3’ సినిమా ఎవరూ చూడొద్దు” అని పేర్కొన్నాడు. “కోర్ట్ నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడకండి” అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడేంటని చాలామంది ఆలోచనలో పడ్డారు. నిర్మాతగా తన ప్రాడక్ట్‌పై ఉన్న నమ్మకం అని కొందరు అనుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రమిది. నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది అంటే దానిపై…