గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ…