బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్ ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ కథ వారాహి గుడి, ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు నారా రోహిత్ చుట్టూ సాగుతుంది. వారు ఒకరి…