Blockbuster maker Boyapati Sreenu and Ustaad Ram Pothineni’s highly anticipated mass action entertainer Skanda is getting ready for release. The first and title glimpse of the movie presented Ram in a never-seen-before mass avatar. Meanwhile, the makers kick-start the musical festival of the movie. The first single Nee Chuttu Chuttu is out now. The composer S Thaman is in his elements as he has composed a very peppy and massy tune with full-on mass beats and crazy lyrics which are quite rhythmic. The music director kept the mood and tempo…
Year: 2023
#NC23 కోసం మత్స్యకారుల కుటుంబాలను కలిసిన నాగ చైతన్య
యువ సామ్రాట్ నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశారు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నారు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగచైతన్య. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. #NC23 అనే టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నారు. #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ నెలలో షూట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్…
Naga Chaitanya, Chandoo Mondeti, Bunny Vas Meet Fishermen Families In K Matchilesam Village of Srikakulam for #NC23
Yuva Samrat Naga Chaitanya visited a village in Srikakulam and spent quality time with the fishermen community for his upcoming film. He has adopted a very new grounded approach to the film and met the fishermen and their families to understand the land, their culture, their lifestyle. Chaitanya is leaving no stone unturned to get into the skin of the character. This is a prestigious project under the direction of Chandoo Mondeti who delivered a Pan India blockbuster with his last movie – Karthikeya 2. Titled #NC23, this crazy project…
22వ సంవత్సరంలోకి ‘సంతోషం’.. అతి త్వరలోనే 2023 అవార్డ్స్ ఫంక్షన్!!
ఒక సినీ వారపత్రిక ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తిచేసుకొని, ఇరవయి ఒకటో వసంతంలోకి అడుగుపెట్టడం అది కూడా సెకను సెకనుకు అప్డేట్స్ వస్తున్న ఈ డిజిటల్ యుగంలో అంటే అది చిన్న విషయం ఏ మాత్రం కాదు. ఆగస్ట్ 2వ తేదీతో ‘సంతోషం’కు 21 ఏళ్లు నిండి 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ రోజున పరిస్థితులలో పత్రికా నిర్వహణ కత్తిమీద సాము లాంటి వ్యవహారం, న్యూస్ ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్న కాలంలో ఆర్థికంగా అది అత్యంత కఠిన పరీక్ష, ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ ‘సంతోషం’ దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వెళుతోంది. సినీ వార పత్రికా రంగంలో ఇది అపురూప సందర్భం! ఈ సందర్బాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి…
‘భోళా శంకర్’ విజువల్ ట్రీట్ లా వుంటుంది: డీవోపీ డడ్లీ
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయిక కాగ, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డడ్లీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇది మీ తొలి తెలుగు సినిమా కదా.. ఈ ప్రయాణం గురించి చెప్పండి ? దర్శకుడు మెహర్ రమేష్, నేను పదేళ్ళుగా మంచి స్నేహితులం. లాక్ డౌన్ పిరియడ్ లో ఓ రోజు కాల్…
జి.వి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్ ‘డియర్’ షూటింగ్ పూర్తి
జి.వి ప్రకాష్ కుమార్-ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న “డియర్” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ‘డియర్’ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుంచి అంచనాలు పెరిగాయి. దానికి కారణం ‘మ్యూజికల్ కింగ్’ జి.వి. ప్రకాష్ కుమార్, అద్భుతమైన నటి ఐశ్వర్య రాజేష్ తొలిసారి కలసి నటించడం. నట్ మెగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ తిరిపురేణి, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సేతుమ్ ఆయిరమ్ పొన్’ఫేం ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన స్క్రిప్ట్‌ను రూపొందించడంలో ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వ ప్రావీణ్యం, మంచి ఎగ్జిక్యూషన్ పట్ల నిర్మాతలు సంతోషంగా వున్నారు. ప్రీప్రొడక్షన్ దశలోనే అనుకున్న ప్రకారం కేవలం 35 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ‘డియర్’ చిత్రాన్ని…
‘తిరగబడరసామీ’ అతి త్వరలో విడుదల
యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామానాయడు స్టూడియోలో జరుగుతోంది. హీరో, హీరోయిన్, రాజా రవీంద్రపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. మీడియా సమావేశంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’తిరగబడరసామీ’ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్. రవికుమార్ చౌదరి గారి గత సినిమాల్లానే యాక్షన్ కామెడీ రోమాన్స్ ఎక్కడా తగ్గకుండా వుంటాయి. ఇవాళ రేపటి తో మొత్తం షూటింగ్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ చివరి దశలో వున్నాయి.…
ఆగస్టు 4న రానున్న ‘ప్రియమైన ప్రియ’
గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో ఘనంగా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు..ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. సి.హెచ్ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీ కి U/A సెన్సార్ సర్టిఫికెట్ సోంతం చేసుకుంది.. దర్శకుడు A. J…
#VD13 / #SVC54 సెట్స్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బర్త్ డే
గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ (VD13) పదమూడో చిత్రంగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో (SVC54) 54వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ వంటి వారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే దిల్ రాజు, శిరీష్‌లో వాసు వర్మ చేతులు కలిపారు. ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా సినిమా టీం అంతా కలిసి…
Happy Birthday : అచ్చతెలుగు కుందనపు బొమ్మ అనన్య నాగళ్ల!
టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు కొరవడిన సమయంలో అందం, అభినయంతో తన నటనాప్రతిభను కనబరుస్తూ ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకున్న అచ్చతెలుగు కుందనపు బొమ్మ హీరోయిన్ అనన్య నాగళ్ల. చేసింది తక్కువ సినిమాలే అయినా విశేష ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. అంతేకాదు అనన్యకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. దాదాపు తన ఇనిస్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ తో నిత్యం తన ఇష్టాఇష్టాలతో పాటు అదిరిపోయే పిక్స్ తో, రీల్స్ తో అలరిస్తుంది. పరిశ్రమకు వచ్చి కొంత కాలమే అయిన తన డ్రీమ్ కమ్ ట్రూ అయిన పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్న ఈ అపురూప పారిజాతం అనన్య నాగళ్ల పుట్టిన రోజు సందర్భంగా తన గురించి, అలాగే తాను చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం… ఖమ్మం జిల్లా…
