శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా తప్పకుండా ప్రోత్సహిస్తుందనే విషయాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న సపోర్టుతో మరో సారి ప్రూవ్ అయింది. నాయట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో కమర్షియల్ హంగులతో చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది.…
Month: November 2023
తండ్రి కొడుకుల కథ ‘యానిమల్’ అందరినీ అలరిస్తుంది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. సందీప్ గారు.. ముందుగా మీకు కంగ్రాట్స్..…
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా మూన్‌షైన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల.. త్వరలోనే షూటింగ్
చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ పరంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ద్రిష్టి తల్వార్ హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు వేర్వేరు ప్రపంచాలు కలయికగా యూనిక్‌నెస్‌తో కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోనర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా…
శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
హారర్ కామెడీ జోనర్‌లో అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ `గీతాంజలి`ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని మేకర్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయి. నలుగురు…
నందమూరి కుటుంబ సభ్యుల మధ్యవైభవంగా ‘బ్రీత్’ ప్రీరిలీజ్ ఈవెంట్
నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా తాతగారు నందమూరి…
నిరంతర విద్యుత్‌పై కాంగ్రెస్ విమర్శలు అర్థరహితం : బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్
తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని వినియోగదారు లందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బోట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.12,727 కోట్లు కేటాయించి, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,500 కోట్లకు పెంచింది. విద్యుత్ తలసరి వినియోగం 2014`15లో 1,356 యూనిట్లుగా ఉంది. 2021`22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లుగా ఉంది. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు రూ. 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110…
రెండున్నర గంటలు నిజాయతీగా సినిమా తీసే దర్శకుడు అజయ్ భూపతి… నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ : ‘మంగళవారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విశ్వక్ సేన్
ప్రతి నటుడి జీవితాన్ని ఓ శుక్రవారం మారుస్తుంది… నా జీవితాన్ని ‘మంగళవారం’ మార్చింది : సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ప్రియదర్శి న్యూఏజ్ ఫిలింమేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా ‘మంగళవారం’. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. ఇవాళ మాస్క్ వెనుక ఉన్న నటుడు, మాలచ్చిమ్మ పాత్రలో నటించిన ప్రియదర్శి…
ప్రపంచ ‘ట్రయత్‌లాన్ ’కు వరుసగా మూడుసార్లు ఎంపికైన తొలి భారతీయుడు మన తెలుగువాడు మన్మధ్ రెబ్బ..
స్పోర్ట్స్ అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి ఆట క్రికెట్. ఆ తర్వాత వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ.. ఇలా ఓ అరడజను మాత్రమే టక్కున గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచంలో మరిన్ని స్పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో అత్యంత క్లిష్టమైన రేస్ ‘ట్రయత్‌లాన్’. ‘ట్రయత్‌లాన్’ అంటే ఈత కొట్టడం.. సైకిల్ తొక్కడం.. పరుగెత్తడం అనే మూడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కంబైన్డ్‌గా ఉంటాయి. ఇందులో కూడా అనేక ఛాంపియన్ షిప్‌లు ఉంటాయి. అన్నింటిలోకి అత్యంత క్లిష్టమైన ‘అల్ట్రామాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ హవాయి ట్రయత్‌లాన్’ అనే రేస్‌లో వరుసగా 2017,18,19 సంవత్సరాల్లో అర్హత సంపాదించిన ఏకైక భారతీయుడు, మన తెలుగువాడు,హైదరాబాద్ కు చెందిన మన్మధ్ రెబ్బ. ఇక్కడ ఆర్కిటెక్ట్ పూర్తి చేసి, యూఎస్‌లో కన్స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయటానికి వెళ్లిన ఆయన కోర్సు అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తుండగా ఈ స్పోర్ట్స్…
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’.. డిసెంబర్ 1న విడుదల
బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతలు విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు పాటలు, టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో…