నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, మా నాన్నమ్మ బసవతారకం గారు నాకు స్ఫూర్తి. వారి ఒడిలో పెరిగాను. వారి ఆశీస్సులతో ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ పెట్టి పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. నాన్నగారు మంచి కథతో సినిమా చేయమని చెప్పారు. దర్శకుడు వంశీకృష్ణ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది. వంశీ గారు అద్భుతమైన కాన్సెప్ట్ తో అన్నీ విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు. భవిష్యత్ లో మేము మళ్ళీ కలసి పని చేస్తాం. మా బాబాయ్ బాలకృష్ణ గారు, బి గోపాల్, కోడిరామకృష్ణ గారిది ఎలా హిట్ కాంబినేషన్ గా నిలిచిందో మాది కూడా తప్పకుండా హిట్ కాంబినేషన్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు. తాతగారు తనకంటూ సొంత మార్క్ ని క్రియేట్ చేసుకొని కోట్లాదిమందికి ఆరాధ్య దైవమయ్యారు. నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్న సందర్భంలో నాన్న గారు ‘’నీకంటూ ఒక సొంత మార్క్ ని క్రియేట్ చేసుకో, ఎవరినీ అనుకరించవద్దు’ అని సూచించారు. ఆ సూచనకు కట్టుబడివుంటాను. ఈ బ్యానర్ నుంచి అభిమానులకు నచ్చే మంచి మంచి సినిమాలు వస్తాయని తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు చాలా మంది కొత్త నటీనటులు పని చేశారు. అందరూ అద్భుతంగా నటించారు. హీరోయిన్ వైదిక చాలా చక్కగా నటించింది. కెమరామెన్ రాకేశ్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులో డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ వుంటుంది. మార్క్ రాబిన్ ఈ సినిమాకి అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది.’’అన్నారు.
లోకేశ్వరి మాట్లాడుతూ.. చైతన్య కెరీర్ లో ఇది మొదటి ప్రయోగం. మీ అందరి సహకారం అతని చాలా అవసరం. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ . ఇది టీం వర్క్. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి చైతన్యతో పాటు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
మాధవి మణి మాట్లాడుతూ.. పుణ్యదంపతులు నందమూరి తారకరామారావు గారు, బసవతారకం గారి ఆశీస్సులతో బ్రీత్ సినిమా పెద్ద విజయం సాధించి చైతన్య కృష్ణకు ఈ చిత్రంలో పని చేసిన అందరికీ మంచి పేరుతీసుకొస్తుందని కోరుకుంటున్నాను’ అన్నారు.
నందమూరి మోహన రూప మాట్లాడుతూ.. పుణ్యదంపతులు నందమూరి తారకరామారావు గారు, బసవతారకం గారి ఆశీస్సులతో మొదలైన బ్యానర్ ఇది. అన్నయ్య చైతన్య కృష్ణ మొదటి చిత్రమిది. దర్శకుడు వంశీకృష్ణ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారు. అన్నయ్య నుంచి ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు రావాలి. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
శ్రీనివాస్ గారపాటి మాట్లాడుతూ.. బ్రీత్ సినిమా మంచి విజయం సాధించి మా చైతు బావకి మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వంశీకృష్ణ గారికి,. అలాగే ఈ చిత్రానికి పని చేసిన అందరినీ పేరుపేరునా అభినందనలు. జై ఎన్టీఆర్.. జై బాలయ్య’’ అన్నారు.
నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. బ్రీత్ మంచి ఎమోషనల్ థ్రిల్లర్. చైతన్య కృష్ణ చాలా అద్భుతంగా చేశాడు. దర్శకుడు వంశీ కథ స్క్రీన్ ప్లే తో పాటు చాలా గొప్పగా డైరెక్ట్ చేశారు. సినిమా చూశాను. చాలా వండర్ ఫుల్ గా వచ్చింది. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ వేడుకు విచ్చేసిన నందమూరి అభిమానులకు, మా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.’’ తెలిపారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ నమస్కారం. మా అమ్మ, నాన్నగారి పేరుతో బ్యానర్ స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా అనందంగా వుంది. మా అన్నయ్యకి ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం చైతన్య కృష్ణకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు వంశీ కృష్ణ గారికి చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. ఈ బ్యానర్ మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్.. జై బాలయ్య’’ అన్నారు
నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో మా అమ్మ, నాన్న పేర్లు ఇమిడివున్నాయి. ఈ బ్యానర్ స్థాపించిన మా అన్నయ్యకు నా ధన్యవాదాలు. బ్రీత్ అంటే ఊపిరి. చైతన్య కృష్ణ కి కూడా సినిమా అంటే చాలా ఇష్టం. చైతన్య కూడా ఈ వంశం నుంచి వచ్చిన ఆర్టిస్టుల్లా నిలదొక్కుకొని కీర్తి ప్రతిష్టలు తీసుకోస్తారని ఆశిస్తున్నాను. మీ అందరీ ఆశీస్సులతో తను భవిష్యత్ లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్’’ అన్నారు.
దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు తీసుకోవాలని ఈ సభా ముఖంగా కోరుతున్నాను. నందమూరి జయకృష్ణగారి ధన్యవాదాలు. ఈ బ్యానర్ ఓపెనింగ్ నుంచి మా చిత్ర యూనిట్ ని ప్రోత్సహించిన నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. నందమూరి కుటుంబసభ్యులంతా హాజరైన ఈ వేడుక ఒక అద్భుతం. పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రానికి కర్త,కర్మ,క్రియ నందమూరి చైతన్య కృష్ణ గారు. ఆయన బంగారం. చైతన్య కృష్ణ ఈ సినిమాతో ఒక వెర్సటైల్ హీరోగా ప్రూవ్ అవుతారు. చేసిన మొదటి సినిమానే చాలా వెర్సటైల్ కాన్సప్ట్ చేశారు. సినిమా అంతా ఒకే ఎమోషన్ ని మెంటైన్ చేయడం కష్టం. ఆలాంటి అరుదైన పాత్ర చేశారు. ఆ పాత్రలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా టీం వర్క్. చైతన్య కృష్ణ కోసం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని మరో అద్భుతమైన కథని రెడీ చేశాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత అది కూడా చేయాలనేది నా ఆకాంక్ష. చైతన్య గారితో ఏడాదిన్నర ప్రయాణం చేశాను. చాలా సందర్భాల్లో ఆయన పెద్ద ఎన్టీఆర్ గారిలా, బాలకృష్ణ గారిలా కనిపించారు. బాలయ్య బాబునే డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది. బాలయ్య గారితో సినిమా చేయడం నా కల. అది భవిష్యత్ లో నిజం కావాలని కోరుకుంటున్నాను. బాలయ్య బాబు గారి కోసం కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ రెడీగా వుంది. అయితే ఆయనకి రీచ్ కావడానికి దర్శకుడిగా ఒక సత్తా కావాలి. ఆ సత్తాని బ్రీత్ సినిమా సక్సెస్ ఇవ్వాలని, అలా నన్ను బ్లెస్ చేయమని బాలకృష్ణ గారిని కోరుతున్నాను. ’’ అన్నారు .
వైదిక సెంజలియా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో భాగం కావడం చాలా అనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చైతన్య కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వండర్ ఫుల్ జర్నీ. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ చిత్రం మా అందరికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ వేడుకలో సహస్ర, కేశవ్ దీపక్, మార్క్ కే రాబిన్, ఇషా, బొంతల నాగేశ్వర్ రెడ్డి, రాజీవ్ కుమార్, ఐషని, డేవిడ్ జోన్స్ , నరేంద్ర, షేక్ మహమ్మద్, మధు నంబిర్, శ్రీరామ్ నీల ప్రియ తదితరులు పాల్గొన్నారు.