‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతంగా ఉంది.. సూపర్బ్‌గా కట్ చేశారు. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత…
Month: November 2022
‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్ వేడుకలో అతిథుల ఆకాంక్ష
శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ…‘‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం. హీరో రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్ ఉన్నాయి.…
వైభవంగా ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు : ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లోని ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగాయి. ఈ ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు ప్రతీ ఒక్కరికీ మరపురాని అనుభూతని కలిగించాయి. ఈ సందర్బంగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పలు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞాన విహారంలో తెలియాడాలని, ఈ విషయంలో ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ముందుండాలని కోరారు. మనదేశంలొ విద్యను అభ్యసించిన భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నత మైన స్థానాలో వున్నారన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసారు. బ్రిటన్ ప్రధాని భారతీయులు కావడం…
ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’…పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం : కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సమంతతో పాటు మిగతా పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆ ముగ్గురూ చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో శనివారం కల్పికా గణేష్, దివ్య…
మార్వెల్ స్టూడియోస్ ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభం!
అద్భుతమైన ప్రేక్షకుల స్పందనతో మార్వెల్ బిగ్గీ గార్నర్స్ రూ. 1వ రోజున 15.05 కోట్ల గ్రాస్ బాక్సా ఆఫీస్ కలక్షన్స్ వచ్చాయి. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు మరియు అధిక సానుకూల సమీక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా, వారాంతపు కలక్షన్స్ క్రమంగా పెరుగుతూ ఉండటంతో బాక్సా ఆఫీస్ వద్ద ఈ చిత్రం గొప్పగా ప్రారంభమైంది! బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ కి “బెస్ట్ MCU ఫిల్మ్ ఆఫ్ ఫేజ్ 4”, “సినిమా వి డిజర్వ్” మరియు “స్పెక్టాక్యులర్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్” లాంటి అసాధారణమైన మౌత్ టాక్ అలాగే సెంటిమెంట్‌లు ఉన్నాయి. అలాగే ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా వేయబడింది. మార్వెల్ స్టూడియోస్ యొక్క బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ ప్రస్తుతం…
“Geetha Film Distribution” aiming for another Blockbuster just like Kantara with Varun Dhawan and Kriti Sanon’s Thodelu
Allu Aravind, the mega producer, is a visionary filmmaker in every way. He is always two steps ahead of the trend, and he makes decisions that can change the course of the industry. They will surprise you at first, but they will make sense after a few days. Unstoppable, an Aha OTT talk show, is just one example. Because of his determination to bring good movies to the audience, “aha” became a Telugu OTT platform and expanded its services to other languages today. Superhit movies from other languages are now…
‘కాంతార’ తరహాలోనే ‘తోడేలు’తో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’
మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కొందరు కాలంతోపాటు పరిగెడుతుంటారు, కానీ ఈయన మాత్రం కాలానికి ఒక రెండు అడుగులు ముందే ఉంటారు. ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహాతీతం, అవి మొదటి ఆశ్చర్యం కలిగిస్తాయి, కొన్ని రోజులు తరువాత అర్ధమవుతాయి, ఇంకొన్ని రోజులు తరువాత అద్భుతం అనిపిస్తాయి. “ఆహా” లో అన్ స్టాపబుల్ లాగా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లాలి అని ఆయనకు ఉండే సంకల్పమే నేడు “ఆహా” ఓటిటి ప్లాట్ ఫ్రామ్. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో అందించడం అనేది తెలుగు ప్రేక్షకులకు గొప్ప విషయం. కేవలం ఓటిటిలోనే కాకుండా థియేటర్స్ లో కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తూ మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 30…
Yasodha Telugu Movie Review : ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’!
చిత్రం : యశోద విడుదల : 11, నవంబర్ 2022 రేటింగ్ : 3.75/5 నిర్మాణం : శ్రీదేవి మూవీస్ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం : హరి -హరీష్ నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు. *** సంగీతం: మణిశర్మ మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి పాటలు: రామజోగయ్య శాస్త్రి కెమెరా: ఎం. సుకుమార్ ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్ క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి. సమంత…
బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బి.నర్సింగ్ రావు!
తరచుగా అతడిని వరిస్తుంటాయి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, విశిష్ట వ్యక్తుల పేరుతో ఏర్పాటైన సమున్నత పురస్కారాలు! అతడు బహుముఖ సృజనాత్మక ప్రతిభాశాలి బొంగు నరసింగరావు! బి. నరసింగరావుగా విఖ్యాతుడైన అతని నిరుపమాన జీవనయాత్ర తెలిసిన వారికి ఈ పురస్కారాల వెల్లువలు ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించవు. థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవన స్రవంతి వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యున్నత ప్రతిభకు ఈ ప్రామాణిక పురస్కారాలు ప్రతీకలు. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని రంగాల్లో ఆయన నెలకొల్పిన సాధికారతకు నిదర్శనం; తనకు లభించిన పది జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు, అసంఖ్యాక అంతర్జాతీయ అవార్డులు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, తెలంగాణ ప్రజలు, సమ్మోహన పరిచే జానపదుల కళలు, తన మదిలో, ఎదలో, రక్తనాళాల స్పందనలలో నవనవోన్మితంగా చివురులు…
నవంబర్ 18న దిల్ రాజు విడుదల చేస్తున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మసూద’
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ విషయం తెలిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని.…
