మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...