‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్‌లుక్‌తోనే పన్నా రాయల్ నుంచి మరో డిఫరెంట్ మూవీ రాబోతోందని అర్థమైంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా ‘ఇంటి నెం.13’ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్యబోతోందని అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు.
‘ఇంటి నెం.13’ టీజర్ విడుదలైన సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన సినిమా ఇది. మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కంటెంట్ పరంగానే కాదు, టెక్నికల్‌గా కూడా చాలా హై రేంజ్‌లో ఉంటుంది. ఆడియన్స్‌కి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.‘‘ అన్నారు.
నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ ‘‘ఈరోజు టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మా బేనర్ నుంచి ఓ డిఫరెంట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ట్రైలర్ రిలీజ్‌తో ఈ సినిమాపై ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయన్న నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం‘‘ అన్నారు.
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని, గీతాసింగ్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్, ఎడిటింగ్: ఎస్.కె.చలం, కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్, మాటలు: వెంకట్ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, సింగర్స్ శ్రియా గోషల్, రాజలక్ష్మి(తమిళ్ సామి సాంగ్ ఫేమ్), మాల్గాడి శుభ, ఐశ్వర్య యాజమాన్య, నిర్మాత: హేసన్ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.