స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ హీరోలుగా పాన్ ఇండియన్ మూవీ ‘మిస్టర్ X’ ప్రారంభం

Star actress Manju Warrier comes onboard for the pan Indian movie “Mr. X” starring Arya & Gautham Karthik, written and directed by Manu Anand; produced by Prince Pictures. The film’s Pooja ceremony was conducted today.
Spread the love

స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. ప్రముఖ నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనఘ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కొన్ని వారాల క్రితం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఎఫ్‌ఐఆర్’ ఫేమ్ మను ఆనంద్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “మిస్టర్ X” యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, ఇందులాల్ కవీద్ ఆర్ట్ డైరెక్టర్. కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తరా మీనన్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, స్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిస్టర్ X చిత్రానికి ఎ. వెంకటేష్ సహ నిర్మాత. మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: ఆర్య, గౌతమ్ కార్తీక్, మంజు వారియర్, అనఘ తదితరులు.
సాంకేతిక విభాగం: రచన & దర్శకత్వం: మను ఆనంద్, సంగీతం: ధిబు నినన్ థామస్, DOP: తన్వీర్ మీర్, ఎడిటర్: ప్రసన్న జికె
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్, యాక్షన్ డైరెక్టర్: స్టంట్ సిల్వా, ఆర్ట్: ఇందులాల్ కవీద్, కాస్ట్యూమ్ డిజైన్: ఉత్తరా మీనన్, అదనపు స్క్రీన్ ప్లే: దివ్యాంక ఆనంద్ శంకర్, రామ్ హెచ్ పుత్రన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పాండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్రవంతి సాయినాథ్
సహ నిర్మాత: ఎ. వెంకటేష్, నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్, బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్, పీఆర్వో: వంశీ-శేఖర్.

Related posts

Leave a Comment