సుమన్ టివి కి అభినందనలు!

సుమన్ టివి కి అభినందనలు!
Spread the love

సుమన్ టీవీ లో భారీగా జీతాలు పెంచినట్లు, బెంజ్ కార్లు జర్నలిస్టులకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది! సుమన్ టీవీ శాటి లైట్ కూడా కాదు, జస్ట్ యు ట్యూబ్ ఛానెల్! గొప్ప గొప్ప ఇంటర్వ్యూ లతో జనాన్ని బాగా ఆకర్షించింది! ఎనిమిది ఏళ్లల్లోనే అద్భుతాలు సృష్టిస్తోంది! పేరుకు యు ట్యూబ్ అయినా టెక్నికల్ గా, స్టూడియో సెట్స్ పరంగా శాటి లైట్ టీవీ లను మించిపోయింది!
సహజంగా జర్నలిజం రంగం కప్పల సామెత ను గుర్తు చేస్తుంటుంది! పైగా ఆ సామెత జర్నలిస్టులకు బాగా వర్తిస్తుంది. శాలరీ టైం కు ఇవ్వాలని యాజమాన్యాలకు వున్నా “అబ్బే తొందరేం లేదు” అని వారించే ఒక పెద్ద జర్నలిస్ట్ బాస్ ఉండనే ఉంటాడు ప్రతి సంస్థలో! ఒకవేళ ఒక జర్నలిస్ట్ మంచి ఐటమ్ ప్రెజెంట్ చేసినా అది అతడి ప్రతిభ కాదు, అంతా నేనే ఐడియా ఇచ్చి చేయించి ఎడిట్ చేశాను అని చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాడు ఇంకో బుజ్జి బాస్! నువ్వెంత టాలెంట్ చూపించినా దాన్ని కోత కు గురి చేసే బాధ్యత ఇంకో చిన్న బాస్ తీసుకుంటాడు! వాళ్లే బతకాలిగా మరి! కప్పల సామెత లా ఎవ్వరిని ఎదగనియ్యకుండా తొక్కేసే బాసులు ప్రతి సంస్థలో ముఖ్యంగా మీడియా సంస్థల్లో తప్పనిసరిగా ఉంటారు! దీన్ని ఆసరా చేసుకుని యాజమాన్యాలు కూడా ఇష్టా రాజ్యాంగా వాడేసుకుంటారు! ఆలస్యంగా జీతాలు ఇస్తారు! ఇష్టం వచ్చినప్పుడే ఇస్తారు! బోనస్ లు వుండవు! ప్రధాన సంస్థల్లో పని చేయించుకున్నా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి అందులో ఉద్యోగాలు చేస్తున్నట్లు సృష్టించి చివరికి PF లు కూడా లేకుండా చేసేస్తారు! ఒక రోజు అకస్మాత్తుగా ఉద్యోగం లోంచి పీకేస్తారు… జీతాలు పెంచాల్సి వచ్చినప్పుడు! ఇవన్నీ యాజమాన్యాలు చేసినట్లు అనిపిస్తాయి కానీ, చేసేది చేయించేది జర్నలిస్ట్ బాసులే!
ఇలాంటి నేపథ్యంలో సుమన్ గారి లాంటి వాళ్ళను నిజంగా దేవుడు లాంటి మనిషి అని చెప్పాలి. సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారికి అభినందనలు. జర్నలిస్టుల శ్రమ ను గుర్తించి బెంజ్ కార్లు గిఫ్ట్ గా ఇవ్వడం మామూలు విషయం కాదు! గుజరాత్ లో ఒక వజ్రాల వ్యాపారి ఆయన దగ్గర పని చేసే వారికి కార్లు బహుమతిగా ఇచ్చారని తెలిసినప్పుడు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు! ఎందుకంటే అది వజ్రాల వ్యాపారం! మీడియా సంస్థల్లో ఇది ఊహ కు కూడా అందని విశేషం! అలాంటిది సుమన్ గారు తన సంస్థలో పనిచేస్తున్న ఐదుగురికి ప్రమోషన్లు ఇచ్చి ఒక్కొక్కరికి బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చి, జీతం భారీగా పెంచి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించి గొప్ప ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించారు! ఇది నిజమైతే నిజ్జంగా ఇదొక చరిత్ర! 30 ఏళ్ళు గా జర్నలిజం లో వున్నా ఇలాంటి అద్భుతం వినలేదు, కనలేదు, ఊహించను లేదు! ఐదు లక్షలు జీతం, బెంజ్ కార్లు అందుకున్న జర్నలిస్ట్ మిత్రులకు అభినందనలు🌹

– డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment