యూట్యూబ్ లో మనం రోజు….మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్… ఇలా ప్రతి రోజు తెలుగు లో ఎదో ఒక కంటెంట్ చూస్తూ ఉంటాము. అయితే, ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం తక్కువే అని చెప్పచ్చు. ఈ మధ్య ఈ సాంగ్స్ కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సందర్బంగా ‘షేడ్స్ స్టూడియోస్’ పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి ‘వోక్స్ బీట్జ్’ మ్యూజిక్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా సంగీత ప్రియులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించడానికి సిద్దమైంది. అయితే ఆదివారం హైదరాబాద్ లో వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ ను సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్ మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ తదితరులు వచ్చి షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ ఛానల్ వారు ప్రేక్షకులకు ఆలోచింపజేసే విధంగా తీసిన బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్ పై తీసిన ‘నా మది’, కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ ‘జారే మనసు జారే’, ‘వయ్యారి’, ‘షరీభో షరీభో’, ‘బులుగు చొక్కా’, ‘జాబిలివే’ వంటి పాటలను విడుదల చేయడం జరిగింది. అనంతరం……
దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ… ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా ‘స్టోరీ టెల్లింగ్’ సాంగ్స్ లా సినిమా చూస్తున్నట్లే ఉన్నాయి. అలాగే, ఈ పాటలన్ని సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. నటీనటులు అందరు కూడా చాలా సెటిల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అద్భుతంగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీమ్ అందరు కూడా ఇలాగే మంచి మెసేజ్ ఉన్న పాటలు తీస్తూ న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ఈ ఛానల్ మంచి ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ప్రతి సాంగ్ లో హుక్ లిరిక్ ఉంటుంది, జారే మనసే జారే సాంగ్ హుక్ లైన్ అద్భుతంగా ఉందని కొనియాడారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. కొత్త టాలెంట్‌ను తీసుకొని చాలా లొకేషన్స్ లో ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్ అన్నారు.
PRESSMEET FULL GUEST & CREW SPEECHES VIDEO
సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ… టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక ఐడెంటిటీ ఇస్తున్న ఉపేంద్ర గారు, దేవి ప్రసాద్ గార్లకు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ… నేను ఈ స్టేజ్ మీద ఉండటం చాలా హ్యాపీ గా ఉంది. నాకు ప్రతి సాంగ్ బాగా నచ్చింది. అలాగే, టీం లో ప్రతి ఒక్కరు బాగా చేసారు. ముఖ్యంగా, బ్లైండ్ గా నటించిన వ్యక్తి యాక్టింగ్ సూపర్బ్. వోక్స్ బీట్జ్, షేడ్స్ స్టూడియోస్ ఛానల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్: వోక్స్ బీట్జ్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూజర్ జెకే నాకు చిరకాల మిత్రుడు. వోక్స్ బీట్జ్, షేడ్స్ స్టూడియోస్ సంయుక్తంగా చేస్తున్న ఈ ఆల్బమ్ సాంగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లే చేసిన అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.
వోక్స్ బీట్జ్ ఛానల్ కో ఫౌండర్ ఉపేంద్ర రాచుపల్లి మాట్లాడుతూ… పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్న షేడ్స్ స్టూడియోస్ సహకారంతో మేము నలుగురు ఫ్రెండ్స్ కలసి ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్ తో వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ ను స్టార్ట్ చేయడం జరిగింది. కళ్ళు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందనే కాన్సెప్ట్ తో ‘నా మది’ పాటను తీశాము. అంతర్వేదిలో ‘జాబిలి’ అనే సాంగ్ చేసి జాలర్ల అసోసియేషన్ కు కొంత అమౌంట్ డొనేట్ చేశాము. లోకల్ ట్యాలెంట్ ఎంకరేజ్ చేయాలని అక్కడి వారితోనే ‘జారే మనసు జారే సాంగ్’ చేశాము. ఇలా మా ఛానల్ ద్వారా కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింప చేసే పాటలు చేస్తామని అన్నారు.
షేడ్స్ స్టూడియోస్ డైరెక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ… వోక్స్ బీట్జ్ ఛానల్ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా దగ్గర ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డి ఐ, వి.యఫ్.ఎక్స్ ఇలా టోటల్ పోస్ట్ ప్రొడక్షన్స్ సెటప్ ఉంది. మేజర్, భామకలాపం సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. లేటెస్ట్ గా హరిహర వీరమల్లు సినిమా సాంగ్ రికార్డింగ్ అయ్యింది. ప్యార్లల్ గా కొత్త ట్యాలెంట్ ను సపోర్ట్ చెయ్యాలనే ఆలోచన ఉన్న మాకు వోక్స్ బీట్జ్ వారు తోడవ్వడం చాలా సంతోషం కలిగించింది. నలుగురు ఫ్రెండ్స్ కలసి స్టార్ట్ చేసిన వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ నిర్మాతలు అమెరికాలో ఉంటారు. వారు కూడా మా లాగే కొత్త ఐడియాలజీ, మ్యూజిక్ సెన్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో మ్యూజిక్ చేయాలని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. దాంతో మా టీం అంతా కలసి వోక్స్ బీట్జ్ ఛానల్ కు కంటెంట్ ను ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మేము ఆరు కంటెంట్స్ మూడు వీడియో, మూడు ఆడియో లను రెడీ చేసి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటలకు లిరిక్ రైటర్స్, సంగీత దర్శకులు, సింగర్స్ ఇలా అందరూ ఈ పాటలకు ప్రాణం పెట్టి వర్క్ చేశారు. నటీ నటులు అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో ఈ పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ఇందులోని వయ్యారి పాటకు నేనే డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ పాటకు పండు మాస్టార్, శ్వేతా నాయుడు కలసి చేసిన డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించారు అని చెప్పవచ్చు. మేము ఇందులో 100 సాంగ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.