వైభవంగా ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవం!

NataSimha Nandamuri Balakrishna's VeeraMass BlockBuster VeeraSimhaReddy వీరసింహుని విజయోత్సవం event
Spread the love

ప్రేక్షక దేవుళ్లుందరికీ కృతజ్ఞతలు :నందమూరి బాలకృష్ణ
‘వీరసింహరెడ్డి’ సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం: దర్శకుడు గోపీచంద్ మలినేని
‘వీరసింహరెడ్డి’ బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ : నిర్మాత నవీన్ యెర్నేని

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా వీరసింహుని విజయోత్సవం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో బాలకృష్ణ చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటో ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
వీరసింహుని విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు గోపీచంద్ మొదట వచ్చినపుడు చెన్నకేశవరెడ్డి గుర్తొస్తుందని చెప్పాను. తను అయోమయంలో పడ్డాడు. సీమరక్తం కదా కుతకుత లాడుతుందని అన్నాను. వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’… అన్నాడు. ఒక అద్భుతమైన కథని రాశాడు. ఇది ఒక గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో అద్భుతమైన సినిమా చేశాం. తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా అభిమానులు ‘వీరసింహారెడ్డి’ అద్భుతంగా వుందని ప్రసంశించారు. వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. తొడగొట్టి చెబుతున్నాను.. వీరసింహారెడ్డి లో సీమ వాసన కనిపించింది. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. సాయి మాధవ్ బుర్రా పదునైన మాటలు రాశారు. ఇన్ని రకాల పాత్రలు చేశానంటే అది నా అదృష్టం. ఇంకా కుర్రాడిలా వుండటానికి నా రహస్యం అదే. సినిమా, నా హాస్పిటల్, హిందూపురం నియోజికవర్గం గురించి తప్పా నాకు మరో ఆలోచన లేదు. దునియా విజయ్, వరలక్ష్మీ గారు పోటాపోటీగా విలనిజం పండించారు. ఇలాంటి పాత్రలు చేయడం ఒక సాహసం. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. వీరసింహారెడ్డి లో ఒక విస్పోటనం జరిగింది. నేపధ్య సంగీతంతో పాటు ఆణిముత్యాలు లాంటి పాటలకు మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చారు తమన్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ ని సమకూర్చారు. డివోపీ రిషి పంజాబీ, విష్ణు, ప్రసాద్ .. అద్భుతంగా పని చేశారు. ఇందులో మూడు టైం జోన్స్ వున్నాయి. టర్కీలో కూడా అందంగా చిత్రీకరించారు. హానీ రోజ్ తన పాత్రలో నవరసాలు పండించారు. శ్రుతి హాసన్, నట విశ్వరూపం కమల్ హాసన్ గారి డిఎన్ఎ. తన పాత్ర మేరకు చాలా అద్భుతంగా నటించారు. లాల్ గారు ఎక్కడా మాట్లడకుండా అద్భుతమైన పాత్ర చేశారు. చివర్లో ఆ పాత్ర పేలింది. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష. మీ అంతులేని అభిమానం, అనంతమైన ఆత్మీయత, ఎవరికీ దక్కని ప్రేమానురాగాలు చూపిస్తున్న మీకు..మీ బాలకృష్ణ మనసు ఎప్పుడూ పరిచివుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. అందరి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా సినిమానే ఊపిరిగా జీవిస్తున్న నిర్మాతలు రవి గారు నవీన్ గారు. ఒక మంచి సినిమాకి పని చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న మాకు ప్రేక్షకులు ఇంత ఘన విజయం ఇచ్చారంటే.. మా వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్లుందరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు’’ తెలియజేశారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాలకృష్ణ గారితో వీరసింహరెడ్డి సినిమా చేసిన అవకాశం రావడం నా అదృష్టం. శతజయంతి ఉత్సవాలు ఒక పండగలా వుంటే.. వీరసింహరెడ్డి మరో పండగ తీసుకొచ్చింది. మా సినిమాని ఇంతపెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి రుణపడి వుంటాను. ఒక ఫ్యాన్ గా ఈ సినిమా తీశా. బాలయ్య బాబు చుట్టపట్టుకొని డిఫెండర్ లో దిగుతూ వుంటే ఈ సినిమా నేను తీశాననే సంగతి మర్చిపోయి విజల్స్ కొట్టాను. ఫ్యాన్స్, ఫ్యామిలీస్ కలిస్తేనే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. నా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్ తన పాత్రని చక్కగా చేసింది. సాయి మాధవ్ గారు అద్భుతమైన మాటలు రాశారు. రిషి అసాధారణ విజువల్స్ ఇచ్చారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ సుపర్బ్ గా చేశారు. హానీ రోజ్ పాత్రకు అద్భుతమైన ఆదరణ వచ్చింది. తమన్ ఈ చిత్రానికి బ్లడ్ పెట్టి పని చేశాడు. బాలయ్య బాబు ని నేను ఎంత ఇష్టపడతానో తమన్ అంత ఇష్టపడతాడు. అందుకే ఈ సౌండ్. రామజోగయ్య శాస్త్రి గారు సింగల్ కార్డ్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎక్స్ ట్రార్డినరీ ఫైట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా బాలయ్య గారితో చేసానంటే కారణం నిర్మాతలు నవీన్ గారు రవి గారు. క్రాక్ సినిమా విడుదలకి ముందే బాలయ్య గారితో సినిమా చేస్తున్నామని నమ్మకంతో వచ్చారు. ఈ వేడుకకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. పీఆర్వో వంశీ శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన బాలకృష్ణ గారికి, దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంకా లాంగ్ రన్ వుంది. సినిమా ఇంకా చాలా దూరం వెళుతుంది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు.
తమన్ మాట్లాడుతూ… బాలకృష్ణ గారితో అఖండ తర్వాత, గోపి బావ ఈ కథ చెప్పినప్పుడు నెక్స్ట్ లెవల్ కి ఎలా తీసుకెళ్ళాలని నాను నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. గోపి మాములుగా తీయలేదు. కీ బోర్డ్ ని రెండు కత్తులు పట్టి వాయించాను(నవ్వుతూ) బాలయ్య గారిని చూస్తూనే ఒక పూనకం వచ్చేస్తుంది. అఖండ తర్వాత బాలకృష్ణ గారిలో ఒక శివుడిని చూస్తున్నాను. నా అభిమానాన్ని మ్యూజిక్ ద్వారా చెప్పాను. బాలకృష్ణ గారి సినిమాకి పని చేయడం ఒక గిఫ్ట్. రామ జోగయ్య గారు పాటలకు తన అక్షరాలతో ఆక్సిజన్ పోశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్ ని ఒక ఎమోషన్ గా చూస్తారు. అందుకే మ్యూజిక్ కూడా అంత నిజాయితీగా వస్తుంది. సాయి మాధవ్ గారు కత్తుల లాంటి మాటలు రాశారు. సంక్రాంతికి రెండు విజయాలు అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ కి అభినందనలు’’ తెలిపారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. బాలయ్య గారు ఫోన్ చేసి ‘’బ్రో ఏం చేస్తున్నావ్’’ అని అడిగారు. ఇండస్ట్రీ కి వచ్చి ఏం సాధించావ్ అంటే.. బాలకృష్ణ గారి ప్రేమని సంపాదించానని చెప్తాను. బాలయ్య గారికి ప్రతి రోజు కొత్త ఫ్యాన్స్ పుడుతున్నారు. హ్యాట్సప్ బాలయ్య గారు. జై బాలయ్య’’ అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ముందుగా బాలకృష్ణ గారికి థాంక్స్ చెప్పాలి. ఇప్పుడు సినిమా తీయడం కాదు హిట్ సినిమా తీయాలి. గాడ్ అఫ్ మాసస్ లాంటి స్టార్ తో సినిమా చేయాలంటే ఒక యూఫోరియా క్రియేట్ చేయాలి. అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. వీరసింహరెడ్డి పవర్ ఫుల్ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ కి అభినందనలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
హానీ రోజ్ మాట్లాడుతూ..వీరసింహరెడ్డి విజయంలో భాగం కావడం ఆనందంగా వుంది. మీనాక్షి పపాత్రకు గొప్ప ఆదరణ వస్తోంది. ఈ పాత్ర దొరకడం గొప్ప వరం. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, గోపీచంద్ మలినేని గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. ఇందులోన పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. వీరసింహరెడ్డి టీం అందరికీ బిగ్గెస్ట్ కంగ్రాట్స్. అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చేశారు. సాయి మాధవ్ గారు అద్భుతమైన మాటలు రాశారు. తమన్ పూనకం వచ్చినట్లు మ్యూజిక్ చేశారు. బాలయ్య బాబు గారి లానే దర్శకుడు గోపి మలినేని అన్ స్టాపబుల్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ బి కె సీజన్ నడుస్తోంది. బ్యాట్ టు బ్యా బ్లాక్ బస్టర్స్ తో బాలయ్య బాబు గారు అన్ స్టాపబుల్. ఒక సినిమా చేస్తున్నపుడు అభిమానుల కోసం ప్రత్యేకంగా అలోచిసస్తారు. ఎన్ బి కె టచ్ తో వీరసింహరెడ్డి వచ్చింది. ఎన్ బి కె టచ్ తో మళ్ళీ 108 రాబోతుంది. అయితే ఈసారి అన్న తెలంగాణలో దిగుతుండు.. బాక్సాఫీసు ఊచకోటషురూ చేస్తాడు. కలెక్షన్స్ తో కుర్బానీ పెడతాడు. గెట్ రెడీ’’ అన్నారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాని పతాక స్థాయిలో తీసుకెళుతున్నా బాలకృష్ణ గారికి అభినందనలు. మా బావ గోపి చంద్ కి ఈ సక్సెస్ ఒక్క రోజుతో వచ్చింది కాదు.. దిని వెనుక ఇంతో హార్డ్ వర్క్ వుంది. ఈ సినిమా థియేటర్లో చూస్తున్నపుడు బాలయ్య బాబు విలన్స్ ని నరుకుతుంటే కొందరు మహిళా ప్రేక్షకులు ‘’బాలయ్య బాబు ఎంత క్యూట్ గా నరుకుతున్నాడో’’అన్నారు. నాకు కాసేపు అర్ధం కాలేదు. ఇలా అందంగా నరకడం బాలయ్య గారికికే చెల్లింది. ఈ సినిమా ఫస్ట్ నేనే డైరెక్ట్ చేశా. ముహూర్తం షాట్ ని నాతోనే డైరెక్ట్ చేయించాడు గోపి. ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా వుంటే రేపు సినిమా డైరెక్ట్ చేస్తే.. అతి త్వరలోనే బాలయ్య బాబు గారిని మంచి కథతో ఒప్పించి ఒక సినిమా చేయడానికి చాలా ఉత్సాహపడుతున్నాను. ఇది నా కోరికే కాదు మా నిర్మాతల కోరిక కూడా. రవిగారు, నవీన్ గారికి అభినందలు’’ తెలిపారు.
హను రాఘవపూడి మాట్లాడుతూ.. బాలయ్య గారికి వున్న కోట్ల మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని. ఫ్యాన్స్ బాలయ్య బాబు ని ఎలా చూడాలని అనుకుంటారో దర్శకుడు గోపి గారు దాని కంటే ఎన్నో రెట్లు గొప్పగా చుపించారు. జై బాలయ్య ఇప్పుడు పెద్ద కల్ట్. అందులో నేనూ ఒక మెంబర్ నే. వీరసింహరెడ్డిని ప్రేక్షకులు గొప్పగా.. సంక్రాంతి నవరాత్రుల్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు’’ అన్నారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ వేడుక ద్వారా మా అభిమాన హీరో బాలకృష్ణ గారిని నేరుగా చూసే అవకాశం కల్పించిన మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. వీరసింహరెడ్డి దర్శకుడు గోపీచంద్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. తర్వాత సినిమాతో మాస్ ని మరో లెవల్ కి తీసుకువెళ్తారని భావిస్తున్నాను. అభిమానులకు నచ్చే మ్యూజిక్ చేయడం తమన్ కి తెలుసు. సంక్రాంతి పండకి మనందరికీ గొప్ప ఆనందం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్’’ తెలిపారు.
రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. వీరసింహరెడ్డి బ్లాక్ బస్టర్ విజయం కొట్టిన టీం అందరికీ అభినందనలు తెలిపారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలని అద్భుతంగా చేశారు. అందుకే ఈ సినిమా అంత బాగా వచ్చింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, తమన్, డీవోపీ రిషి పంజాబీ .. ఇలా అందరు సాంకేతిక నిపుణులు గ్రేట్ వర్క్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్య గారిని చూసి ఫ్యాన్ అయిపోయా. థియేటర్ లో జై బాలయ్య అంటూ అరిచిఅరిచి నా గొంతు పోయింది(నవ్వుతూ). బానుమతి లాంటి గుర్తుపెట్టుకునే పాత్రని ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ కి, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
దునియా విజయ్ మాట్లాడుతూ… బాలయ్య గారి సినిమాలో పని చేయడం నా కెరీర్ లో గొప్ప ఎచీవ్ మెంట్. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, దర్శకుడు గోపీచంద్ గారికి కృతజ్ఞతలు. తమన్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చారు. బాలకృష్ణ గారు అన్ స్టాపబుల్, వరలక్ష్మీ గారు అన్ బీటబుల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు.
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నదగ్గర నుంచి, బాలయ్య బాబు ఓకే చెప్పిన నుంచి.. ఇంత పెద్ద సంచలన విజయం సాధిస్తుందని చెబుతూనే వున్నా. ఇంత అద్భుతమైన సినిమాలో మాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా చేస్తున్నపుడు మేమంతా బాలయ్య బాబు గారిలా మారిపోయేం కాబట్టే ఇంత ఎమోషన్ తో సినిమా వచ్చింది. బాలయ్య బాబు చెప్పకపోతే డైలాగులు ఇంత గొప్పగా పేలవు. ఆయన కాబట్టే సినిమా ఇంత గొప్ప స్థాయిలో వుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బంగారం. ఈ సినిమాకి వచ్చిన ప్రశంసలు జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు.
రామ జోగయ్య శాస్త్రి ..వీరసింహరెడ్డి విజయంలో భాగం కావడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద సినిమాలో సింగల్ కార్డ్ రాసే అవకాశం ఇచ్చిన బాలయ్య గారికి, దర్శకుడు గోపి చంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. తమన్ ఈ సినిమా కోసం చాలా శ్రమించి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. సినిమాకు ఇంతపెద్ద ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు. అజయ్ ఘోస్, సచిన్ ఖేడేకర్, లాల్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ మాస్టర్, అవినాష్, సప్తగిరి, జాన్, నాగమహేష్, శంకర్ మాస్టర్ , సమీర్ తదతరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment