హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జంధ్యాల హాస్య పురస్కారాల’ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులకు పలు పురస్కారాలను అందించారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. లీడర్ ఆఫ్ లాఫింగ్స్ పురస్కారాన్ని దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి అందుకోగా.. నటులు రఘుబాబు, అలీ, గెటప్ శ్రీను, సునయన మాస్టర్ ఆఫ్ స్మైల్స్ పురస్కారం వరించింది. నటుడు ప్రదీప్, తన ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించారు. మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబుమోహన్, రేలంగి నరసింహారావు, పూర్ణిమ, తదితరులు మెరిశారు.
‘‘జంధ్యాల అందించిన హాస్యం అమ్మ పాలైతే.. ఇప్పుడున్న కామెడీ డబ్బా పాలు అన్నారు’’ నటుడు కోట శ్రీనివాసరావు. ఆదివారం నగరంలో నిర్వహించిన జంధ్యాల హ్యూమర్ సిటీ అవార్డుల వేడుకలో భాగంగా కోట శ్రీనివాసరావుకు జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జంధ్యాల అక్షరం తిని.. లక్షలు సంపాదించిన నటుడ్ని నేను. జంధ్యాల తర్వాత ఆ స్థాయికి తీసుకెళ్లిన మరో దర్శకుడు రేలంగి నరసింహారావు’ అని చెప్పారు. ఈ వేడుకలో దర్శకులు అనిల్ రావిపూడి, మారుతిలకు లీడర్స్ ఆఫ్ లాఫ్టర్ పురస్కారాలను, అలీ, గెటప్ శీను, సునయన తదితరులకు మాస్టర్ ఆఫ్ స్మైల్స్ అవార్డులను అందించారు. సినీ నటులు మురళీమోహన్, బాబూమోహన్, రేలంగి నరసింహారావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు ప్రదీప్ మాట్లాడుతూ… నాకు జంధ్యాల గారు ఒక కన్ను అయితే.. నాకు రెండో కన్ను మా అనిల్ రావిపూడి అని వ్యాఖ్యానించాడు.
ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ… నాకు అవార్డు ఇవ్వగానే టెన్షన్ అయింది. నాకు జంధ్యాల గారి ఓ సినిమా గురించి. ష్ గప్ చుప్ అని.. అందులో దొంగల కాలేజ్ అని ఉంటుంది. ఇది నవ్వుల కాలేజ్. చాలా మంది దర్శకులు.. జంధ్యాల గారి సినిమాలు చూసి స్పూర్తి చెంది.. సినిమాలు తీస్తున్నారు. నాకు జంధ్యాల గారే స్ఫూర్తి. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి.. ఆయన క్యారెక్టర్స్ వేస్తూ ఉండే వాడిని. ఇప్పుడు నేను సినిమాలు తీస్తున్నాను అంటే.. కారణం ఆయనే. జంధ్యాల గారు ఓ నవ్వుల లైబ్రరీ. అని చెప్పుకొచ్చాడు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ... జంధ్యాల గారి సినిమాలు చూసి.. పెరిగాను. వీసీఆర్ లో ఆయన సినిమాలు చూసేవాడిని. చిన్నప్పుడు అమ్మ చేతి వంట తిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదో జంధ్యాల గారి సినిమాలు చూస్తే హ్యాపీ వచ్చింది. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఆయన స్ఫూర్తి తోనే కామెడీ సీన్స్ రాయాల్సిందే. నేను ఆయన సినిమాలు చూసి పెరిగి.. ఆయన స్పూర్తితోనే ఇలా డైరెక్టర్ ను అయ్యాను. అంత పెద్ద లైబ్రరీను ఇచ్చిన జంధ్యాల గారికి కృతజ్ఞాతలు. ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్లు.. ఇంకా ఎవరు చేయలేరు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. జంధ్యాల గారి ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్స్.
నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ… మా నేటితరం జంధ్యాల గారు ఈవీవీ గారు, రాజేంద్రప్రసాద్ గారు, యంగ్ అండ్ డైనామిక్ దర్శకుడు అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. జంధ్యాలు గారి సినిమాలో ఆ వయసు లేకపోయినప్పటికీ ఆ స్పూర్తితో ఇప్పుడు నటులు లాగా చేయడం సంతోషంగా ఉంది.